Saturday, July 4, 2026
Homeభక్తిYadadri | యాదాద్రి అభివృద్ధిపై సీఎం దృష్టి..

Yadadri | యాదాద్రి అభివృద్ధిపై సీఎం దృష్టి..

  • ప్రత్యేక టూర్ ప్యాకేజ్ తీసుకొచ్చిన ప్రభుత్వం..

యాదగిరి గుట్టపై కొలువుదీరిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రాన్ని గత ప్రభుత్వం కోట్లాది రూపాయలతో పునర్ నిర్మించింది. పూర్తిగా కృష్ణ శిలలతో, అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం, నిపుణులైన స్తపతులతో ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. దీంతో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం.. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. దీంతో ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువైంది. ప్రతి రోజు వేలాది మంది, పండుగల సమయంలో లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. ఈ రద్దీని పర్యాటకాభివృద్ధికి అనుసంధానం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ టూరిజం ప్రత్యేక ప్యాకేజీని రూపొందించింది.

ముఖ్యమైన ప్రాంతాలను కలిపి టూరిజం సర్క్యూట్ ను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీంతో తెలంగాణ టూరిజం శాఖ భక్తులు, సందర్శకుల కోసం ప్రత్యేక ప్యాకేజ్ ని తీసుకువచ్చింది. ఇప్పటి వరకు యాదాద్రికి వచ్చిన భక్తులు దర్శనం ముగిసిన వెంటనే వెనుదిరిగేవారు. ఇప్పుడు భక్తులు వారసత్వ ప్రదేశాలపై ఆసక్తి కలిగిన పర్యాటకు అదే ప్రయాణంలో చారిత్రక కోటలు, పురాతన దేవాలయాలు, ఆధ్యాత్మిక, సాంస్కృతిక చారిత్రక, చేనేత వైభవాన్ని ప్రతిబింబించే ప్రాంతాలను ఒక్కరోజులో ఆస్వాదించే అవకాశం కల్పిస్తోంది

- Advertisement -
RELATED ARTICLES

Latest News