Homeనిజామాబాద్‌Inspection | విద్యార్థులకు మెనూ, ప్రకారం భోజనం అందించాలి.

Inspection | విద్యార్థులకు మెనూ, ప్రకారం భోజనం అందించాలి.

  • తాడ్వాయి స్పెషల్ ఆఫీసర్ రఘుపతి.

విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన, రుచికరమైన,భోజనాన్ని అందించాలని తాడ్వాయి మండల స్పెషల్ ఆఫీసర్ రఘుపతి అన్నారు ఆయన శుక్రవారం మండలంలోని కస్తూర్బా పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వంటశాలను, తరగతి గదులను, పాఠశాల పరిసర ప్రాంతాలను, పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన,ఆహారాన్ని, సమతుల్యంగా మెనూ ప్రకారం అందించాలని పాఠశాల పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని, విద్యార్థులకు వారికి అర్థమయ్యే విధంగా పాఠాల బోధింపు ఉండాలన్నారు. పాఠశాలకు సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, సమస్యలను జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించే విధంగా కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రాణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News