Homeకరీంనగర్Vision High School | స్టూడెంట్ కౌన్సిల్ ప్రమాణ స్వీకార మహోత్సవం

Vision High School | స్టూడెంట్ కౌన్సిల్ ప్రమాణ స్వీకార మహోత్సవం

రేకుర్తి లోని విజన్ హై స్కూల్ లో నిర్వహించిన స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికలలో గెలుపొందిన వారిచే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల కరస్పాండెంట్ సిరిపురం ప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ మాట్లాడుతూ స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికలలో గెలుపొందిన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, విద్యార్థులందరూ విద్యార్థి దశ నుండే నాయకత్వ లక్షణాలను, క్రమశిక్షణను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. మొట్టమొదటిసారి మన స్కూల్లో ఎన్నికల నిర్వహించాము.

కావున ఎన్నికలలో గెలిచిన వారు విద్యార్థులు అందరికీ , భవిష్యత్తులో వచ్చే కమిటీలకు ఆదర్శంగా ఉండేలా పనులు నిర్వహించాలని, స్టూడెంట్ కౌన్సిల్ కమిటీ స్కూల్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని సూచించారు స్కూల్ హెడ్ బాయ్, స్కూల్ హెడ్ గర్ల్, స్కూల్ స్పోర్ట్స్ హెడ్ బాయ్ , స్కూల్ స్పోర్ట్స్ హెడ్ గర్ల్, స్కూల్ కల్చరల్ హెడ్ బాయ్ , స్కూల్ కల్చరల్ హెడ్ గర్ల్ లతో పాటు పాఠశాలలోని అన్ని విభాగాలలో అసిస్టెంట్ బాయ్స్, గర్ల్స్ చే ప్రమాణస్వీకారం చేయించి బ్యాడ్జ్ అందజేశారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ సందవేణి వెంకట్ ఇంచార్జ్ ప్రతిభ భారతి, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ,విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News