Homeరంగారెడ్డిJawahar Nagar | ఆగని అక్రమ నిర్మాణాలు

Jawahar Nagar | ఆగని అక్రమ నిర్మాణాలు

  • అధికారుల చర్యలు శూన్యం
  • తూతూమంత్రంగానే కూల్చివేతలు..?

జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాల జోరు కొనసాగుతున్నా అధికారుల చర్యలు మాత్రం తూతూమంత్రంగానే ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సంతోష్‌నగర్ ప్రాంతంలోని ప్రభుత్వ స్థలాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్నారనే ఆరోపణలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి.

గతంలో కాప్రా ఎంఆర్‌ఓ మతిన్ ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టడంతోపాటు కూల్చివేతలు నిర్వహించినప్పటికీ, ఆ చర్యలు పూర్తిస్థాయిలో కొనసాగకపోవడంతో అక్రమ నిర్మాణదారుల్లో భయం లేకుండా పోయిందని స్థానికులు అంటున్నారు. డిప్యూటీ కమిషనర్ రామలింగం వచ్చిన తర్వాత అక్రమ నిర్మాణాలు మరింత జోరందుకున్నాయనే గుసగుసలు స్థానికంగా వినిపిస్తున్నాయి.

- Advertisement -

ప్రభుత్వ స్థలాల్లో అనుమతులు లేకుండా బహుళ అంతస్తుల నిర్మాణాలు కొనసాగుతుండటం అధికారుల పర్యవేక్షణపై అనుమానాలకు తావిస్తోంది. అధికారుల అండదండలు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో రెవెన్యూ, మున్సిపల్ అధికారులు స్పందించి వాస్తవాలను నిగ్గు తేల్చాలని ప్రజలు కోరుతున్నారు.

ఇప్పటికైనా అధికారులు అక్రమ నిర్మాణాలను గుర్తించి నోటీసులు జారీ చేయడంతోపాటు, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవనే స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసి, కూల్చివేతలను తూతూమంత్రంగా కాకుండా పూర్తిస్థాయిలో చేపట్టాలని కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News