Saturday, July 4, 2026
Homeక్రైమ్ వార్తలుKetan Agarwal Case | కేతన్ అగర్వాల్ హ*త్య కేసులో కీలక మలుపు..

Ketan Agarwal Case | కేతన్ అగర్వాల్ హ*త్య కేసులో కీలక మలుపు..

  • లైడిటెక్టర్ పరీక్షలకు నిడఁడితులు నో..
  • జ్యుడిషియల్ రిమాండ్ కు తరలింపు..

మహారాష్ట్రలోని పుణె జిల్లాలో సంచలనం సృష్టించిన ప్రముఖ వ్యాపారవేత్త, రియల్టర్ 25 ఏళ్ల కేతన్ అగర్వాల్ హ*త్య కేసులో మ‌రో కీల‌క ట్విస్ట్‌ చోటుచేసుకుంది. నిందితులు సియా గోయెల్, చేత‌న్ చౌధ‌రి ల‌కు లైడిటెక్ట‌ర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌న్న పోలీసుల ప్ర‌య‌త్నాలకు గండిప‌డింది. లైడిటెక్ట‌ర్ సియా, ఆమె ప్రియుడు చేత‌న్ ఒప్ప‌కోలేదు. దాంతో పోలీసులు ఆ ఇద్ద‌రినీ మ‌ళ్లీ జ్యుడీషియ‌ల్ రిమాండ్‌ కు త‌ర‌లించారు. కాగా శుక్ర‌వారం నిందితుల పోలీస్ క‌స్ట‌డీ ముగియడంతో పోలీసులు వారిని వడ్గావ్ మావల్ కోర్టుకు త‌ర‌లించారు. ఆ ఇద్ద‌రినీ జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీకి ఇవ్వాల‌ని కోరారు.

దాంతో కోర్టు నిందితులిద్ద‌రికీ 14 రోజుల జ్యుడీషియ‌ల్ కస్టడీ విధించింది. ఇదిలావుంటే జూన్ 18న లోహగఢ్ కోటపై నుంచి కేతన్‌ను తోసి హ*త్య చేసినట్టు అతడితో నిశ్చితార్థం చేసుకున్న 20 ఏళ్ల‌ సియా గోయల్, ఆమె ప్రియుడు, 22 ఏళ్ల‌ చేతన్ చౌదరి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసు విచారణలో పోలీసులు షాకింగ్ విషయాలను తెలుసుకున్నారు. నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించగా.. మే నెలలోనే పుణెలోని లూల్లానగర్ సమీపంలో ఉన్న ఒక క్లబ్ వద్ద కేతన్‌ను కొండపై నుంచి ఎలా తోసేయాలో వీరిద్దరూ కలిసి ‘రిహార్సల్’ చేసినట్లు తేలింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News