- విటమిన్ డీ తో అరికట్టవచ్చు..
- అధ్యయనంలో తేలిన విషయం..
ప్రస్తుత కాలంలో భారతదేశంలో ప్రీడయాబెటిస్ సమస్య వేగంగా పెరుగుతోంది. ఐసీఎంఆర్-ఇండియాబ్ అధ్యయనం ప్రకారం దేశ జనాభాలో సుమారు 15.3 శాతం మంది ప్రీడయాబెటిస్‌తో బాధపడుతున్నారు. ఇది దాదాపు 13.6 కోట్ల మందికి సమానం. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ పరిస్థితి టైప్-2 డయాబెటిస్‌గా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధిక మోతాదులో విటమిన్-డి సప్లిమెంట్లు కొంతమందిలో డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తాయని తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ పరిశోధనను అమెరికాలోని టఫ్ట్స్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించారు. అధ్యయన ఫలితాలు జామా నెట్‌వర్క్ ఓపెన్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
- Advertisement -
