Wednesday, May 20, 2026
Homeబిజినెస్EPFO | ఈపీఎఫ్ సొమ్ము ఇక వేగంగా విత్ డ్రా..

EPFO | ఈపీఎఫ్ సొమ్ము ఇక వేగంగా విత్ డ్రా..

  • యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్ ద్వారా బెరుగా నగదు..
  • వివరాలు వెల్లడించిన కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవియా..

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఖాతాదారులు తమ ఈపీఎఫ్‌ సొమ్మును మరింత సులువుగా, వేగంగా ఉపసంహరించుకొనే అవకాశం రానున్నది. త్వరలోనే యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌ ద్వారా సభ్యులు ఈపీఎఫ్‌ ఖాతాల్లోని నగదును నేరుగా తమ బ్యాంక్‌ అకౌంట్లలోకి బదిలీ చేసుకోవచ్చని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవియా తెలిపారు. ఇప్పటికే ఈ మేరకు ప్రయోగం విజయవంతంగా పూర్తిచేసినట్టు మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఆయన చెప్పారు.

ఈపీఎఫ్‌ నగదును వాడుకోవాలని భావించినవారు తమ ఈపీఎఫ్‌ ఖాతాకు అనుసంధానమైన బ్యాంక్‌ ఖాతాలోకి పరిమితి మేరకు, నిబంధనలకు లోబడి నగదు మొత్తాలను యూపీఐ యాప్స్‌పై పిన్‌ నంబర్‌ను వినియోగించి సులభంగా పంపించుకోవచ్చన్నారు. ఆపై ఆ నగదును ఏటీఎంల నుంచి ఎప్పట్లాగే తీసుకోవచ్చని వెల్లడించారు. ప్రస్తుతం ఈపీఎఫ్‌వో సభ్యులు తమ ఈపీఎఫ్‌ ఖాతాల్లోని నగదును ఉపసంహరించుకోవాలంటే ఆన్‌లైన్‌లో విద్య, వివాహ, గృహ, ఆరోగ్య సమస్యల కారణాలను చూపుతూ క్లెయిమ్‌ చేసుకోవాల్సి వస్తున్నది. దీని పరిష్కారానికి కనీసం 3 నుంచి 5 రోజుల సమయం పడుతున్నది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News