Homeఆరోగ్యంFatty Liver | ఫ్యాటీ లివర్ పేషంట్స్ ఏమి తినాలి.. ?

Fatty Liver | ఫ్యాటీ లివర్ పేషంట్స్ ఏమి తినాలి.. ?

  • కాలేయ బరువులో 5-10 శాతానికి కొవ్వు ఉంటే అది ఫ్యాటీ లివర్..

కాలేయం మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో ఒకటి. జీర్ణవ్యవస్థ నుంచి వచ్చే రక్తాన్ని శుద్ధి చేయడం, శరీరంలోని విషపదార్థాలను తొలగించడం, మందులను జీర్ణక్రియకు అనుకూలంగా మార్చడం, పిత్తరసాన్ని ఉత్పత్తి చేయడం వంటి అనేక కీలక విధులను నిర్వహిస్తుంది. ప్రోటీన్ల తయారీ, రక్తం గడ్డకట్టడం, కొలెస్ట్రాల్ నియంత్రణ, రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడం, ఇన్ఫెక్షన్లతో పోరాడటం వంటి పనుల్లోనూ ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అయితే కాలేయంలో కొవ్వు అధికంగా పేరుకుపోతే ఫ్యాటీ లివర్ సమస్య ఏర్పడే అవకాశం ఉంటుంది. ఫ్యాటీ లివర్‌లో ప్రధానంగా రెండు రకాలున్నాయి.

ఒకటి ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ కాగా, మరొకటి నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. కాలేయం తన సాధారణ విధులను సక్రమంగా నిర్వహించలేని స్థాయిలో కొవ్వు పేరుకుపోయినప్పుడు ఈ సమస్య తలెత్తుతుంది. సాధారణంగా మనం తీసుకునే కార్బొహైడ్రేట్లు, కొవ్వులు శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువగా ఉన్నప్పుడు వాటిలో కొంత భాగం కొవ్వుగా నిల్వ అవుతుంది. కొంతకాలానికి ఈ అదనపు కొవ్వు కాలేయంలోనూ, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ పేరుకుపోతుంది. కాలేయ బరువులో 5 నుంచి 10 శాతానికి పైగా కొవ్వు ఉంటే దాన్ని ఫ్యాటీ లివర్‌గా పరిగణిస్తారు.

- Advertisement -

ఫ్యాటీ లివర్‌ను నియంత్రించడంలో ఆహారపు అలవాట్లకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా ప్రాసెస్డ్ ఫుడ్స్‌, చక్కెర అధికంగా ఉండే ఆహారాన్ని తగ్గించడం ఉపయోగకరంగా ఉంటుంది. మైదా, తెల్ల చక్కెర వినియోగాన్ని తగ్గించడంతోపాటు మద్యం తీసుకోవడం పూర్తిగా మానేయడం లేదా గణనీయంగా తగ్గించడం కూడా ముఖ్యం. తాజా పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు అందడంతోపాటు అదనపు కొవ్వును తగ్గించుకోవడంలో సహాయపడతాయి.

తీసుకునే కేలరీలను నియంత్రించడం ద్వారా శరీరానికి అవసరమైన శక్తి, తీసుకునే ఆహారం మధ్య సమతుల్యతను పాటించవచ్చు. తాజా పండ్లు, కూరగాయలు, ఆలివ్ ఆయిల్, చేపలు ఎక్కువగా ఉండే మెడిటరేనియన్ ఆహార విధానం కూడా ఫ్యాటీ లివర్‌ ఉన్నవారికి ఉపయోగకరంగా ఉంటుంది. తక్కువ కొవ్వుతో కూడిన ఆహారం, శారీరక వ్యాయామంతో కలిపి తీసుకోవడం కూడా ఫ్యాటీ లివర్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News