ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ ఎమ్మెల్యే (బీజేపీ) డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు (Palvai Harish Babu) ఇవాళ కాగజ్‌నగర్(Kagaznagar)లోని ఓ రేషన్ షాపు(Ration Shop)ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పట్టణంలోని సర్సిల్క్‌లో ఉన్న డీలర్ పద్మావతి రేషన్ షాపులోని సన్నబియ్యాన్ని పరిశీలించి పంపిణీ జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీలర్ మాట్లాడుతూ… కొన్ని నెలలుగా తమకు కమిషన్ రావట్లేదని చెప్పారు. దీనికి స్పందించిన శాసనసభ్యుడు.. సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

అంతకుముందు.. ఈజ్గాం గ్రామానికి చెందిన సిరిశెట్టి సత్యగౌడ్‌కు సీఎంఆర్ఎఫ్ చెక్కు(CMRF Check)ను అందజేశారు. అనంతరం ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బోర్కుట్ లక్ష్మణ్‌ను పరామర్శించారు. రాసకొండ భాగ్యలక్ష్మి-వెంకటేష్ దంపతులకు మంజూరైన ఇందిరమ్మ (Indiramma Illu) ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సమస్యలను స్థానికులు ఎమ్మెల్యేకి చెప్పారు. పాత సారసాల గ్రామానికి చెందిన డోంగ్రి తిరుపతి నూతనంగా ఏర్పాటుచేసిన హార్వెస్టర్(Harvester)ను ప్రారంభించారు. పురాతన ఈజ్గాం శివ మల్లన ఆలయంలో కైశిక ద్వాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.



