Tuesday, May 26, 2026
Homeభక్తిTirumala | పర్వంకాసనం గురించి తెలుసా..?

Tirumala | పర్వంకాసనం గురించి తెలుసా..?

  • తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగే కార్యక్రమం..

కలియుగ వైకుంఠంగా పిలుచుకునే తిరుమల శ్రీ మలయప్ప స్వామివారి ఆలయంలో నిత్యం ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. వాటిలో పర్యంకాసనం గురించి తెలుసా? ఎప్పుడూ విన్నట్టు లేదే అనుకుంటున్నారా? పర్యంకాసనం అంటే ఏంటో కాదు.. ఏకాంతసేవ. శ్రీవారి ఆలయంలో రోజులో చివరిగా జరిగే సేవే.. ఏకాంతసేవ. ఆగమ శాస్త్రంలో దీనిని పర్యంకాసనం, శయనాసనం అని కూడా అంటారు. మొదటగా స్వామివారి సన్నిధిలో మూలవిరాట్, ఇతర దేవతామూర్తులకు రాత్రి తోమాలసేవలో అలంకరించిన పుష్పమాలలను సడలిస్తారు. ఆ తరువాత బంగారు పట్టె మంచం తీసుకొచ్చి ఆనందనిలయం ముందు ఉన్న శయన మండపంలో వెండి గొలుసులతో వ్రేలాడదీసి పట్టుపరుపు, దిండ్లు అమర్చుతారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News