Friday, November 14, 2025
ePaper
Homeఆదాబ్ ప్రత్యేకంLands | అసలు ఈ భూములు ఎవరివి?

Lands | అసలు ఈ భూములు ఎవరివి?

(శ్రీరామచంద్రునికి చెందుతాయా..? రైతులకు చెందుతాయా..?)

  • దేవరాయంజాల్ భూములపై కమ్ముకున్న నీలినీడలు..
  • ఇది నిజాంకాలం నాటినుంచి మొదలు అయిన చిత్రమైన కథ..
  • 1925/ 1926 పహాణి ప్రకారం 1521 ఎకరాల స్థలం దేవుడి పేరుపైనే ఉంది..
  • విచిత్రం ఏమిటంటే 1934/1935లో రైతుల పేరు పైకి ఎలా మారింది అన్నది..?
  • 2021లో ఈటల రాజేందర్ పై ఏకంగా నలుగురు ఐఏఎస్ ల నివేదిక..
  • ఈ అధికారులు కష్టపడి ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో ఏముంది..?
  • కోర్ట్ వివాదంలో ఉన్న ఈ భూములలో ఇబ్బడి ముబ్బడిగా గోదాంలు, అక్రమ కట్టడాలు ఎలా వెలిశాయి.. ?
  • ఆలయ భూముల పర్యవేక్షణ చేయాల్సిన స్పెషల్ ఆఫీసర్, మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎక్కడ దాక్కున్నారు..?
  • ఇప్పటికీ నిగ్గు తేలని స్థలాల్లో తూముకుంట మున్సిపల్ అధికారులు ఇంటి నెంబర్ లు ఎలా ఇచ్చారు..?
  • రేవంత్ సర్కార్ ప్రజలకు సమాధానం చెబుతాడా..? శ్రీరాముడికి సమాధానం చెబుతాడా..?

భక్త రామదాసు కథలో తన భక్తుడిని రక్షించడానికి ఆ శ్రీరామచంద్రుడు తన సోదరుడైన లక్ష్మణుడితో(Laxman) కలిసి, అప్పటి సుల్తాన్ ను కలిసి, రామదాసు(Ramadasu) చెల్లించాల్సిన పైకాన్ని చెల్లించిన కథ వింటూ మైమరచిపోయాం.. శ్రీరాముడు భక్తవరదుడు అనుకుంటూ మురిసిపోయాం.. కానీ అంతకంటే మహత్తరమైన చరిత్ర ఇప్పుడు మన కళ్ళముందే జరుగుతోంది..

దేవరాయంజాల్ లో జీరో పర్మిషన్ తో నిర్మాణాలు..

మనం దేవుడు ఉన్నాడని నమ్ముతాం.. ఆపదలో ఉంటే దేవుడే దిక్కు అనుకుంటాం.. ఖచ్చితంగా ఆయన ఆదుకుంటాడు అని విశ్వసిస్తాం.. కానీ ఇప్పుడు నడుస్తున్నది కలికాలం(Kali Kaalam).. ఆ దేవదేవుడికి చెందిన భూముల(Lands)కు సమస్య వచ్చింది.. ఆ సమస్య ఇప్పుడు న్యాయస్థానం పరిధిలో వుంది.. మరి ఇప్పుడు ఆ దేవుడి భూములకే సమస్య వచ్చింది.. మరి ఈ సమస్యను తీర్చే నాథుడు ఎవరు..? ఎక్కడున్నాడు..? కొన్ని కథలు వింటుంటే అర్ధం అవుతుంటాయి.. కొన్ని కళ్ళతో చూస్తే అర్ధం అవుతాయి.. కానీ ఇప్పుడు మేము అందించబోయే ఈ కథ 1925 నుంచి ఇప్పటివరకు అర్థం కాని ప్రశ్నగా మిగిలింది. ప్రభుత్వంలు మారుతున్నాయి.. అధికారులు రిటైర్డ్ అవుతున్నారు.. కానీ దేవరాయంజాల్ శ్రీ సీతారామచంద్రుడి(Seetharamchandra) సంబంధించిన భూముల సమస్య మాత్రం మిస్టరీ(Mystery)గానే మిగిలిపోయింది.. అసలు ఈ భూములు దేవుడికి సంబంధించినవా..? లేక రైతుల(Farmers)కు సంబంధించినవా..? ఈ విచిత్రమైన వ్యవహారంపై ” ఆదాబ్ హైదరాబాద్ ” అందిస్తున్న ప్రత్యేక కథనం.. మీ కోసం..

కోర్ట్ వివాదం లో వున్నా స్థలంలో గోదాం కు ఇంటి నెంబర్ జారీ

మేడ్చల్ జిల్లా ప్రతినిధి

నవంబర్ 02 ( ఆదాబ్ హైదరాబాద్ ):

ఇది నిజాం (Nizam) కాలం నాటి నుంచి నేటి వరకు కొనసాగుతున్న ఆసక్తికర కథనం.. ఒకసారి తరచి చూద్దాం.. మేడ్చల్ జిల్లా(Medchel Malkajgiri District), దేవరయాంజాల్ గ్రామంలో ఉన్న రాములవారి ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది.. అదే 1521 ఎకరాల భూముల వివాదం.. అసలు రాముల వారి భూమి వివాదాల వలలో ఎలా చిక్కుకుంది..? ఆ దేవదేవుడు భూమికి శఠగోపం పెట్టిన మహానుభావులు ఎవరు..?

2021 లో నలుగురు ఐఏఎస్ అధికారుల ప్రత్యేక సర్వే…

దేవరాయాంజాల్ (Devarayamjal) గ్రామంలో మొదటగా ఒక రైతు పేరుపై 1521ఎక్కరాల భూమి ఉంది. అతనికి వంశోద్ధారకులు ఎవరూ లేకపోవడంతో ఈ స్థలాన్ని దేవరాయంజాల్ గ్రామంలో వెలసిన ఆలయంలో వెలసిన శ్రీ సీతారామచంద్రుడి పేరుమీదకు ఆ రైతు ఈ భూమిని విరాళంగా రాసి ఇచ్చాడు.. ఆలా అ భూములు 1925 నుంచి 1933 వరకు పహాణిలో ఆ శ్రీ రాముడి పేరుపైనే రికార్డు వచ్చింది.. అయితే విచిత్రం ఏమిటంటే 1934లో అకస్మాత్తుగా, వున్నట్లుండి కొంతమంది రైతుల పేర్లు రికార్డులో దర్శనం యిచ్చాయి.. అంటే సాక్షాత్తు సీతారామ చంద్రుడు రైతులకు రాసిచ్చాడా..? లేక రైతులు దేవుణ్ణి వేడుకుంటే రికార్డు తారుమారు అయ్యిందా..? అనే ప్రశ్న నేటి వరకు అలాగే మిగిలిపోయింది..

2021 లో నలుగురు ఐఏఎస్ అధికారుల ప్రత్యేక సర్వే…

అవి దేవుడికి సంబంధించిన భూములు అంటూ ప్రభుత్వ అధికారులు.. లేదు ఆభూములు మావే అంటూ రైతులు, స్థానిక ప్రజలు వాదిస్తుండగా ఈ వివాదం కాస్తా న్యాయస్థానానికి చేరింది.. ప్రస్తుతం ఈ వ్యవహారం హైకోర్టులో విచారణలో ఉంది. అయితే ఇటు ప్రభుత్వం.. అటు న్యాయస్థానం ఈ దేవరయాంజాల్ భూముల వ్యవహారం ఎటూ తేల్చకముందే.. ఈ భూముల్లో అక్రమ కట్టడాలు.. అనుమతులు లేని పెద్ద పెద్ద గోదాంలు ఇబ్బడి ముబ్బడిగా వెలిశాయి..

ప్రేక్షక పాత్ర పోషిస్తున్న తూముకుంట మున్సిపల్ అధికారులు(Thumukunta Municipal Officers) :

మేడ్చల్ జిల్లా కాలక్టర్ మాను చౌదరి (ఫైల్ పిక్)

ప్రభుత్వ స్థలాలా..? లేక ప్రైవేట్ భూములా..? దేవుడికి చెందినవా..? అన్న విషయం తేలకముందే, కోర్టు వివాదంలో ఉన్న స్థలాలలో విచ్చలవిడిగా గోదాంలు వెలిశాయి.. పైగా ప్రభుత్వ నియమ నిబంధనలు ఉల్లంఘించి, ఇంటి నెంబర్లు కూడా కేటాయించిన ఘనత మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరి ఆధ్వర్యంలో పనిచేస్తున్న తూముకుంట మున్సిపల్ అధికారులకే దక్కుతుంది.. పైగా ఈ దేవరాయాంజాల్ భూముల పర్యవేక్షణ స్పెషల్ ఆఫీసర్ గా ఉన్నది కూడా మేడ్చల్ జిల్లా కలెక్టర్ గారే.. అయితే ఇంత వ్యవహారం జరుగుతుంటే జిల్లా కలెక్టర్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందో ప్రభుత్వానికే తెలియాలి.. లోగుట్టు పెరుమాళ్ళకెరుక అన్న చందంగా ఆ శ్రీమచంద్రుడికే తెలియాలి.. దేవుడికి న్యాయ వ్యవస్థకు జరుగుతున్న ఈ విచిత్రమైన పోరాటం ఎలాంటి తీరానికి చేరుతుందో వేచి చూడాలి..

RELATED ARTICLES
- Advertisment -

Latest News