రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం విజయదశమి ఉత్సవంలో భాగంగా ఆదివారం మల్కాజిగిరి నియోజకవర్గం నేరేడుమెట్టులో కవాతు నిర్వహించారు. కార్యక్రమంలో నేరేడుమెట్టు నగర్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

వెంకటేశ్వర నగర్ నుండి కవాతు ప్రారంభమై గీతా నగర్ మీదుగా లక్ష్మీ నగర్ , మొగల్ కాలనీ మీదగా సాయినాథపురం వరకు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విభాగ్ కార్యవాహ భర్తకుడి శ్రీనివాస్ పాల్గొని ఆయన మాట్లాడుతూ భారత నిర్మాణంకోసం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఎంతో కృషి చేసిందని, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తి కానున్నవేళ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తోందని తెలిపారు.
