- 30 కేజీల పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు*
- నలుగురు కొనుగోలుదారులు, పరారీలో సూత్రధారి
- నిందితుల వివరాలను వెల్లడించిన బెల్లంపల్లి ఎసిపి కిరణ్ కుమార్
తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రోజున నకిలీ పత్తి విత్తనాలను పట్టుకోవడం జరిగింది. తాండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ పత్తి విత్తనాలను పట్టుకొని నిందితులను అదుపులోకి తీసుకొని విచారించడం జరిగిందని బెల్లంపల్లి ఎసిపి కిరణ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఏసిపి కిరణ్ కుమార్ మాట్లాడుతూ రెచిని గ్రామ శివారులో ఉన్న బ్రిడ్జి వద్ద బైక్ మీద రోళ్ళపాడు నుండి రెచినికి నకిలీ పత్తి విత్తనాలను తెచ్చి కొనుగోలుదారులకు ఇస్తున్నారు అన్న సమాచారం రావడంతో తాండూర్ ఎస్సై K. ప్రసాద్ మరియు కొండలే సుష్మ మండల అగ్రికల్చరల్ ఆఫీసర్ తాండూర్ తన సిబ్బందితో కలిసి వెళ్లి రెచిని శివారులో తనిఖీ చేయగా బైక్ మీద సంచిలో తెస్తున్న నకిలీ పత్తి విత్తనాలు దొరికినట్లు గుర్తించారు. దాదాపు 30 కేజీల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు నిందితుల వివరాలు రోళ్ళపాడు మరియు రెచిని గ్రామాలకు చెందిన…
1) గోగర్ల మల్లేష్ s/o ఎల్లయ్య , వయస్సు : 39 సం లు ,కులం : SC మాదిగ , వృత్తి : వ్యవసాయం , నివాసం : H.No 1-39, రోళ్ళపాడు ,తక్కలపల్లి గ్రామం ,రెబ్బెన మండలం, 2) ముక్క శ్రీకాంత్ s/o రాజేశం, వయస్సు : 26 సం లు ,కులం : మున్నూరు కాపు, వృత్తి : ట్రాక్టర్ డ్రైవరు, నివాసం : H. No 6-37, రెచిని గ్రామమ, తాండూర్ మండలం, 3) గాండ్ల మహేష్ s/o సత్తయ్య, వయస్సు : 34 సం లు ,కులం : ఉప్పర, వృత్తి : డ్రైవరు, నివాసం : H. No 5-92, కూర్మ వాడ,రెచిని గ్రామం ,తాండూర్ మండలం , 4) పిడుగు లక్ష్మణ్ s/o భీమయ్య, వయస్సు : 28 సం లు ,కులం : ముదిరాజ్, వృత్తి : వ్యవసాయం, నివాసం : H. No 6-52/1, ZP హై స్కూల్ రోడ్డు ,రెచిని గ్రామం ,తాండూర్ మండలం . వీటిని చీరాలకు చెందిన తిరుమలశెట్టి రామకృష్ణ s/o సుబ్బారావ్ , వయస్సు : 52 సం లు , కులం : కాపు ,వృత్తి : వ్యాపారం, నివాసం : ప్రకాశం జిల్లా ,ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన అతను అతని పొలాలు ను కౌలు చేసే మల్లేశ్ ద్వారా మోటార్ సైకిల్ మీద తీసుకొని వచి రెచిని గ్రామస్థులు కు ఇస్తుండగా పట్టుకున్న ట్లూ ఎసిపి వెల్లడించారు.
నకిలీ పత్తి విత్తనాలు వాడటం వల్ల భూమి యొక్క సారవంతం కోల్పోయి రానున్న రోజుల్లో పంట యొక్క దిగుబడి తగ్గే అవకాశాలున్నాయని అదే విధంగా ఈ విత్తనాలు వాడటం వల్ల పర్యావరణం పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. గ్లైపోసిట్ నకిలీ విత్తనాలు వాడటం వల్ల రైతులకు చర్మ సంబంధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందన్నారు. అందువల్ల రైతులు ప్రభుత్వం సరఫరా చేసే పత్తి విత్తనాలను వాడాలని అదేవిధంగా లైసెన్సు అనుమతి పొందిన ఫెర్టిలైజర్ దుకాణాల్లో మందులను తీసుకొని రసీదును తప్పకుండా తీసుకోవాలని అన్నారు.
రైతులు దళారుల మాయమాటలు నమ్మి ఈ నకిలీ విత్తనాల బారి నుండి మోసపోకుండా ఉండాలని మా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కూడా అవగాహన కార్యక్రమాలను కూడా పెట్టడం జరుగుతుందన్నారు. గ్రామాల్లో ఎక్కడైనా నకిలీ పత్తి విత్తనాలు ఉన్నట్లుగానే అమ్ముతున్నట్లుగాని సమాచారం తెలిస్తే తెలియజేయాలని వారి వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని ఎసిపి తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దేవయ్య, కొండలే సుష్మ మండల అగ్రికల్చరల్ ఆఫీసర్ ఎస్సై ప్రసాద్ తో పాటు సిబ్బంది ఉన్నారు.
