- కుందుర్గు పోలీస్ స్టేషన్ సందర్శన!!
ఫ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్ జోషి శాంతిభద్రతల నిర్వహణలో భాగంగా కుందుర్గు పోలీస్ స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీలో భాగంగా గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరు, ప్రజలకు అందిస్తున్న సేవలను పరిశీలించారు.
అనంతరం పోలీస్ అధికారులతో సమావేశమైన కమిషనర్ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు. పోలీస్ సిబ్బంది ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, చట్ట వ్యవస్థను కట్టుదిట్టంగా అమలు చేయాలని, శాంతి భద్రతల పరిరక్షణలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
అలాగే స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని, ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెరిగే విధంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా కమిషనర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కను నాటి, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
