బెల్లంపల్లి పట్టణంలో గ్రంథాలయంలో చదువుతున్న విద్యార్థులు తాగునీటి సమస్య ఉందని తన దృష్టికి తీసుకువచ్చిన వెంటనే స్పందించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ఈ రోజు గ్రంథాలయాన్ని సందర్శించారు ఈ సందర్భంగా గ్రంథాలయ స్టడీ సర్కిల్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ విద్యార్థుల ఇబ్బందులను తెలుసుకొని వెంటనే బోర్ వేల్ వేయించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ కి విద్యార్థులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు అనంతరం బోర్ పనులకు కొబ్బరికాయ కొట్టి భూమిపూజ చేసి ప్రారంభించారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, విద్యార్థులు సౌకర్యవంతంగా చదువుకునే వాతావరణం కల్పించడం మన బాధ్యత. తాగునీటి వంటి ప్రాథమిక సదుపాయాలు ఎక్కడా లోటు ఉండకూడదు. విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించడం కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ దావా స్వాతి రమేష్ బాబు , మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
