Homeఆరోగ్యంJunk Food | జంక్ ఫుడ్స్ తో ప్రమాదం..

Junk Food | జంక్ ఫుడ్స్ తో ప్రమాదం..

  • అధిక కొవ్వు, చక్కెరలతో నిండిన ఆహారం..
  • మెదడుపై తీవ్ర ప్రమాదం..

‘జంక్‌ ఫుడ్‌’కు మనిషి మెదడు జంకిపోతున్నది. అధిక కొవ్వు, చక్కెరలతో నిండిన అనారోగ్యకరమైన ఆహారం.. మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఐర్లాండ్‌కు చెందిన యూనివర్సిటీ కాలేజ్‌ కార్క్‌ శాస్త్రవేత్తలు తాజాగా చేపట్టిన పరిశోధన.. ఈ విషయాలను తేల్చింది. ఇందుకు సంబంధించిన వివరాలను ప్రఖ్యాత సైన్స్‌ జర్నల్‌ ‘నేచర్‌ కమ్యూనికేషన్స్‌’ ప్రచురించింది. ఈ సర్వే వివరాల ప్రకారం.. చిన్నతనంలో అధికంగా జంక్‌ఫుడ్‌ తినేవారిలో మెదడు ఆరోగ్యం దెబ్బతింటున్నది.

వారు భవిష్యత్తులో ఆరోగ్యకరమైన ఆహారానికి మారినప్పటికీ.. అప్పటికే మెదడుకు జరిగిన నష్టం పూడ్చలేమని పరిశోధకుల మాట. బాల్యంలో అధిక కేలరీలతో నిండిన, పోషకాలు లేని జంక్‌ఫుడ్‌ తీసుకోవడం వల్ల.. ఆకలిని, తినే అలవాట్లను నియంత్రించే మెదడులోని ‘హైపోథాలమస్‌’ భాగం దెబ్బతింటుంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News