తనను మాజీ ఎమ్మెల్సీగా పరిచయం చేసుకున్న వైనం
పత్తి రైతుల సమస్యపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు (Telangana Jagruti President) కల్వకుంట్ల కవిత (Kavitha) ఆదిలాబాద్ కలెక్టర్(Adilabad Collector)తో ఫోన్‌లో మాట్లాడారు. రైతులకు మేలు చేసేలా సమస్యను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల (Governments) దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి (Request) చేశారు. అయితే.. పరిష్కారం (Solution) తన పరిధిలో లేదని, మీరే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడాలంటూ కలెక్టర్ కవితకి సూచించారు. దీంతో.. తానే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతానని కవిత రైతులకు భరోసా ఇచ్చారు.

కలెక్టర్‌తో కవిత జరిపిన సంభాషణ.. కలెక్టర్ గారూ.. నేను కల్వకుంట్ల కవితను. ఎక్స్ ఎమ్మెల్సీ(Ex Mlc)ని. పత్తి కొనుగోలు చేసేందుకు 12 శాతం తేమ ఉండాలని అంటున్నారంట. మొంథా తుపాన్ కారణంగా 25 శాతం తేమ వచ్చింది. ఇక్కడి పరిస్థితిని మీరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయండి. ప్రైవేట్ వాళ్లకు అమ్ముకోవటం వల్ల పత్తి రైతులకు ఒక్క బండికి రూ. 50 వేలు నష్టం వస్తుంది. తేమ శాతం పెంచే ఆదేశాలను మీరు ఇవ్వలేరా? సమస్యను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లారా? అన్ని జిల్లాలో పత్తి రైతుల పరిస్థితి ఇదే విధంగా ఉంది.

మీరు ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారా? ఈ పరిధిలో ఉన్నంత వరకు పత్తి రైతులకు మేలు చేయండి. ప్రభుత్వం నుంచి గైడ్ లైన్స్ వచ్చే వరకు కనీసం కొనుగోళ్లు ఆపేయండి. మమ్మల్నే కేంద్ర టెక్స్ టైల్ మంత్రితో మాట్లాడమంటారా? మీరు ఏమీ చేయలేరా? కనీసం రెండు రోజుల పాటు మార్కెట్‌ను షట్ డౌన్ చేయండి. అది కూడా చేయలేరా? పత్తి రైతులు రాగానే తేమ శాతం తీసుకుంటున్నారు. అలా కాకుండా పత్తి ఆరబెట్టుకొనే సమయం రైతులకు ఇవ్వండి. కేంద్రంతో మాట్లాడి పత్తి రైతులకు మేలు చేసే ప్రయత్నం మేమే చేస్తాం.

