జూబ్లీహిల్స్ ఉపఎన్నిక (JubileeHills Bye Election) నేపథ్యంలో యూసఫ్‌గూడలోని మహమూద్ ఫంక్షన్ హాల్‌లో మహిళా కాంగ్రెస్ మీటింగ్ (Women Congress Meeting) జరిగింది. ఏఐసిసి (Aicc) తెలంగాణ (Telangana) ఇన్‌చార్జ్ (Incharge) మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan)తోపాటు పార్టీ సీనియర్ నేతలు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంత పెద్ద ఎత్తున సమర్థిస్తున్న మహిళలందరికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో ఎలాంటి ప్రభుత్వం కావాలో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించి వారి అభిప్రాయం తెలియజేశారని అన్నారు. జూబ్లీహిల్స్‌లో జరిగే ఎన్నికలు ప్రభుత్వాన్ని బోలోపేతం చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడిపిస్తుందని చెప్పారు.

తెలంగాణలో అన్యాయాన్ని పెంచి పోషించిన పార్టీని ప్రజలు ఇప్పటికే బూస్థాపితం చేశారని పేర్కొన్నారు. మరొకసారి అలాంటివారి ఆటలు సాగకుండా జూబ్లీహిల్స్‌లో బుద్ది చెప్పే సమయం వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుల మతాలకు అతీతంగా ప్రజా శ్రేయస్సు కొరకు కృషి చేస్తుందని వెల్లడించారు. ఇది జగమెరిగిన సత్యమని గుర్తుచేశారు. బడుగు బలహీన వర్గాలకు కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే న్యాయం లభిస్తుందని పేర్కొన్నారు. ప్రతి మనిషీ సమాన హక్కులతో జీవించాలని కోరుకునేది కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని చెప్పారు. ప్రతీ వర్గం తలెత్తుకొని సంఘంలో నడవాలని రాహుల్ గాంధీ బలంగా ఆకాంక్షిస్తారని తెలిపారు. బలమైన, ఐక్యత గల దేశంగా ఇండియా రూపు దిద్దుకొని ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలనేదే ఆయన కోరిక అని చెప్పారు.
