తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు (Telangana Jagruti President) కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) సోమవారం రాత్రి తొడాసం కైలాష్ (Thodasam Kailash) నివాసంలో సహపంక్తి భోజనం (Companion meal) చేశారు. తొడాసం కైలాష్ ఆదిలాబాద్ జిల్లాలోని ప్రముఖ విద్యావేత్త. గోండు భాష(Gond Language)లో మహాభారతం (MahaBharat), రామాయణం (Ramayan) రచించిన వ్యక్తి. ఈ కార్యక్రమంలో పలువురు ఆదివాసీ ప్రముఖులు పాల్గొన్నారు. జాగృతి జనం బాట (Jagruti Janam Baata) కార్యక్రమంలో భాగంగా కల్వకుంట్ల కవిత.. తొడసం కైలాష్ నివాసంలో రాత్రి బస (Stay) చేశారు.
