Friday, November 14, 2025
ePaper
Homeఆదాబ్ ప్రత్యేకంLand Mafia | యాదాద్రి భువనగిరిలో భూ మాఫియా!

Land Mafia | యాదాద్రి భువనగిరిలో భూ మాఫియా!

  • ప్రభుత్వ భూముల్లో మోసపూరిత లేఅవుట్లు?
  • యాదాద్రి భువనగిరి జిల్లా భూ వ్యవహారంపై ప్రజల్లో ఆందోళన
  • కలెక్టర్ ఆఫీస్ ఉందా.. లేదా..? అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు
  • రికార్డులు మారుస్తుంటే చోద్యం చూస్తున్న సంబంధిత అధికారులు
  • నిషేదిత భూముల్లో డిటిసిపి పర్మిషన్ ఎలా ఇచ్చింది..?
  • 2021 నుంచి నేటి వరకు భూ భారతిలో నిషేధిత జాబితాలో
  • ఎస్ఆర్, ఎమ్మార్వో కార్యాలయాల్లో పనులు చక్కబెడతున్నది ఎవరు..?
  • జయరాం రెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డి లంటే అధికారులకు భయమెందుకు..?

యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం చల్లూరు గ్రామంలో నెలకొన్న భూ వివాదం ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీస్తోంది. ఈ గ్రామంలోని సర్వే నంబర్ 322/4 సహా పలు సర్వే నంబర్లలోని ప్రభుత్వ భూములపై చట్టవిరుద్ధ లేఅవుట్లు, మోసపూరిత రిజిస్ట్రేషన్లు, అధికార దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు తీవక్రంగా వ్యక్తమవుతున్నాయి. భూ భారతి రికార్డుల నిషేధిత, బదిలీ చేయలేని, అభివృద్ధి చేయరాని ప్రభుత్వ భూములని స్పష్టంగా వర్గీకరించబడ్డాయి. అయినప్పటికీ, 2023 జనవరి 11న టీఎల్ 14/2023/ హెచ్ (40 ఎకరాలు), అలాగే టీఎల్పి నెం. 161/2023/5 (70 ఎకరాలు తేదీ, 11 జూలై 2023) ఆధారంగా డిటిసిపి అధికారులు మరియు చల్లూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి సంయుక్తంగా లేఅవుట్ అనుమతులు ఇచ్చినట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది.

Jayaram Reddy

ఈ అనుమతులు మంజూరైన సమయానికే రిజిస్ట్రేషన్ చట్టం 1980 సెక్షన్ 22(ఎ) మరియు తెలంగాణ సవరణ చట్టం 2017 ప్రకారం ఆ భూములు నిషేధిత ఉన్నాయని రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. 22(omega)(1)(omega) మరియు (బి) సెక్షన్ల ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వానికి, దేవాదాయ శాఖలకు లేదా ప్రజా ఉపయోగాల కోసం కేటాయించబడిన భూములపై ఏ రకమైన బదిలీ లేదా రిజిస్ట్రేషన్ చట్టబద్ధం కాదని స్పష్టంగా పేర్కొనబడింది. అయినా కూడా, ఈ చట్టాలను ధిక్కరించి ప్రైవేట్ పారిశ్రామిక సంస్థల ప్రయోజనాల కోసం లేఅవుట్లు ఆమోదించబడ్డాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Shyam Sundar Reddy

పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం 2018 సెక్షన్ 113, తెలంగాణ గ్రామ పంచాయతీ భూ అభివృద్ధి నియమాలు 2002జాబితాలో ప్రకారం లేఅవుట్ లేదా భవన అనుమతులు ఇవ్వాలంటే భూమి స్థితి, రెవెన్యూ క్లియరెన్స్, భూ వినియోగ ధృవీకరణ తప్పనిసరి. కానీ చల్లూరు గ్రామంలో ఇవన్నీ పట్టించుకోకుండా అనుమతులు ఇచ్చినట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.. ధరణి పోర్టల్ రికార్డుల ప్రకారం, ఈ సర్వే నంబర్లు 2021 నుంచే నిషేధిత జాబితాలో ఉన్నాయని స్పష్టంగా ధ్రువీకరించబడ్డాయి. అయినప్పటికీ, 2023లో ఆ భూములకు లేఅవుట్ అనుమతి ఎలా మంజూరైంది? ఇది ప్రజల్లో ప్రధాన ప్రశ్నగా మారింది.


తెలంగాణ రియల్ ఎస్టేట్ సఫరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కొల్లూరి శ్రీనివాసరావు ఈ అంశంపై యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీలకు అధికారిక ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదులో ఆయన డిటిసిపి అధికారులు, చల్లూరు పంచాయతీ కార్యదర్శి, రెవెన్యూ సిబ్బంది తమ అధికారాలను దుర్వినియోగం చేసి చట్టవిరుద్ధంగా అనుమతులు మంజూరు చేశారని ఆరోపించారు.

“కలెక్టర్ ఆఫీస్ ఉందా లేదా? ఎమ్మార్వో ఆఫీసులో రికార్డులు మారుతున్నప్పుడు అధికారులు మౌనంగా ఎందుకు ఉన్నారు?” అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, “సాల్వో ఎక్స్ప్లోసివ్స్ ప్రైవేట్ లిమిటెడ్” వంటి ప్రైవేట్ పేలుడు పదార్థాల సంస్థలకు అనుకూలంగా రిజిస్ట్రేషన్లు, లేఅవుట్లు జరిగాయని, ఆ సంస్థ డైరెక్టర్లు ఐలేని జయరాం రెడ్డి, ఐలేని శ్యామ్ సుందర్ రెడ్డి పేర్లు కూడా ఫిర్యాదులో ప్రస్తావించబడ్డాయి.

ఈ కంపెనీ బైలాస్ ప్రకారం, భద్రతా కారణాల వల్ల అటువంటి ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ అభివృద్ధి నిషేధితమని నిబంధనలు చెబుతున్నాయి. అయినప్పటికీ, ఆ కంపెనీలకు లేఅవుట్ ఆమోదాలు లభించడం ఆశ్చర్యకరంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటివరకు జిల్లా లేదా రాష్ట్ర స్థాయిలో ఏ విధమైన విచారణ ప్రారంభం కాలేదు. అధికారులు పరస్పరం బాధ్యతలు తప్పించుకోవడమే తప్ప, వాస్తవాలను వెలికితీయాలనే ఉద్దేశ్యం కనబడడం లేదని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ ఘటన తెలంగాణ భూ పరిపాలనలో కొనసాగుతున్న అవినీతి, అధికార దుర్వినియోగానికి నిదర్శనంగా నిలిచింది. నిషేధిత ప్రభుత్వ భూముల్లో లేఅవుట్లు, రికార్డు మార్పులు, మోసపూరిత రిజిస్ట్రేషన్లు.. ఇవన్నీ పరిపాలనలోని లోతైన సమస్యలను బయట పెడుతున్నాయని వారు పేర్కొన్నారు. చట్టాలు ఉన్నా, వాటి అమలు లేనప్పుడు అవి పౌరుల రక్షణకన్నా అవినీతికి ఆయుధాలుగా మారుతాయని ప్రజలు వాపోతున్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Latest News