- సంఘటనా స్థలాన్ని సందర్శించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్..
గురువారం అమీర్‌పేట్ మైత్రివనం ప్రాంతంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ ఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థితులను పరిశీలించారు.. అగ్నిప్రమాదానికి గల కారణాలు, జరిగిన నష్టం, సహాయక చర్యల పురోగతి తదితర వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.. అనంతరం బాధిత దుకాణ యజమానులను కలిసి వారికి ధైర్యం చెప్పారు.
ఈ ఘటన దురదృష్టకరమని పేర్కొంటూ, నష్టపోయిన వ్యాపారులకు ప్రభుత్వం తరఫున అందుబాటులో ఉన్న సహాయ సహకారాలు అందించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.. ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం, సంబంధిత అధికారులు బాధితులకు అండగా ఉంటారని ఎమ్మెల్యే భరోసా కల్పించారు.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు..
