Wednesday, January 14, 2026
EPAPER
Homeఆంధ్రప్రదేశ్Chandrababu Naidu | లండన్ పర్యటనలో ఏపీ సీఎం బిజీ బిజీ

Chandrababu Naidu | లండన్ పర్యటనలో ఏపీ సీఎం బిజీ బిజీ

  • పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు
  • ఏపీలో 20వేల కోట్ల పెట్టుబడులకు హిందూజా గ్రూప్ అంగీకారం

లండన్ పర్యటనలో సిఎం చంద్రబాబు బిజీగా గడిపారు. పలువురు పారిశ్రామికవేత్తలతో వరుసగా భేటీలు అయ్యారు. ఏపీకి పెట్టుబడులు ఆహ్వానించేందుకు లండన్ పారిశ్రామికవేత్తల తో ఆంధప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరుసగా సమావేశాలు నిర్వహించారు. లండన్లో ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ క్రిస్ ఫిట్జార్ల ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం భేటీ అయ్యారు. లండన్లో అక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ సంస్థ అతిపెద్ద విద్యుత్ సరఫరాదారుగా ఉంది. ఈ నేపథ్యంలో పునరుత్పాదక విద్యుత్ రంగంలో ఏపీలో పెట్టుబడులు పెట్టాలని అక్టోపస్ ఎనర్జీని సీఎం చంద్రబాబు ఆహ్వానిం చారు.

అమరావతి, విశాఖపట్నంలలో నూతన టెక్నాలజీ ద్వారా విద్యుత్ సరఫరా నియంత్రణ రంగంలో పనిచేసేందుకు అవకాశాలు ఉన్నాయని సీఎం వివరించారు. క్లీన్ ఎనర్జీ, స్మార్ట్ గ్రిడ్, డేటా అనలిటిక్స్ రంగాల్లో ఏపీలో పని చేసేందుకు అవకాశాలు ఉన్నాయని అక్టోపస్ ఎనర్జీ ప్రతినిధులకు స్పష్టం చేశారు సీఎం. 160 గిగావాట్లు గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేసేలా ఏపీ లక్ష్యం పెట్టుకుందని వెల్లడించారు. అలాగే. విద్యుత్ రంగంలో ప్రభుత్వ పాలసీలు వివరించారు ముఖ్యమంత్రి. ఈ రంగంలో ఏపీ నిర్దేశిరచుకున్న మన లక్ష్యాలను వెల్లడించారు ముఖ్యమంత్రి, ఏపీకి వచ్చి పెట్టుబడులు పెట్టాలని ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ క్రిస్ ఫిట్జార్లాడ్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించారు.

- Advertisement -

ఇకపోతే యూకే పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు హిందుజా గ్రూప్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో రూ.20వేల కోట్ల పెట్టుబడులు పెట్టాలని ఆ సంస్థ నిర్ణయించింది. విశాఖలో హిందుజా పవర్ ప్లాంట్ సామర్థ్యాన్ని 1,600 మెగా వాట్లు పెంచడం, రాయలసీమ విద్యుత్ ప్లాంట్లు, మల్లవల్లిలో ఎలక్ట్రిక్ బస్సులు, తేలికపాటి వాహనాల తయారీ ప్లాంట్, ఏపీ వ్యాప్తంగా విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్ల నెట్వర్క్, గ్రీన్ ట్రాన్స్పోర్ట్ ఎకో సిస్టమ్ అభివృద్ధికి ఆ సంస్థ దశవారీగా పెట్టుబడులు పెట్టనుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం, హిందుజా గ్రూప్ మధ్య ఒప్పందం కుదిరింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News