Monday, June 1, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంLB Nagar | ఓపెన్ స్పేస్ లో అక్రమ నిర్మాణాలు

LB Nagar | ఓపెన్ స్పేస్ లో అక్రమ నిర్మాణాలు

  • అక్రమార్కులకు అక్షయపాత్రగా ‘ఎల్బీనగర్ టౌన్ ప్లానింగ’..
  • కోర్టులకన్నా కమిషన్లకే విలువెక్కువ..!
  • ముందు ఇల్లు కట్టు.. తర్వాత పర్మిషన్ ఇస్తాం.. ఇదే తంతు..!
  • ఎల్బీనగర్ జోన్‌లో సరికొత్త ‘మున్సిపల’ రాజ్యాంగం..!
  • ‘కేఎసఆర్ ఇన్ఫ్రా’ అక్రమాలకు అధికారుల అండదండలు?

మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, ఎల్.బీ. జోన్ లో నిబంధనలు కేవలం సామాన్యులకేనా? బడా బిల్డర్లకు అవి వర్తించవా? అంటే అవుననే అంటోంది నాగోల్ సర్వే నెంబర్ 30 లో జరిగిన వ్యవహారం. కేఎసఆర్ ఇన్ఫ్రా అధినేత కె. సురేష్ కుమార్ అక్రమ కట్టడాలకు ఎల్బీనగర్ జోనల్ అధికారులు ఇచ్చిన అనుమతులు మున్సిపల్ శాఖలోనే హాట్ టాపిక్‌గా మారాయి. హైకోర్టులో రిట్ పిటిషన్లు పెండింగ్‌లో ఉండగానే, గతంలో రిజెక్ట్ అయిన ఫైలుకు మున్సిపల్ అధికారులు తిరిగి జీవం పోశారు. పచ్చటి ఓపెన్ స్పేస్ జోన్‌ను కాంక్రీట్ జంగిల్‌గా మారుస్తున్నా అధికారులు కళ్లు మూసుకోవడం వెనుక, కేఎసఆర్ ఇన్ఫ్రా కురిపించిన ‘కాసుల వర్షమే’ కారణమనే విమర్శలు మున్సిపల్ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి.

ప్రజా అవసరాల కోసం, పర్యావరణ సమతుల్యత కోసం కేటాయించిన ఓపెన్ స్పేస్ జోన్లను కాపాడాల్సిన మున్సిపల్ అధికారులే అక్రమార్కులకు అక్షయపాత్రలా మారారు. నిబంధనల ప్రకారం ఎటువంటి శాశ్వత నిర్మాణాలు జరగకూడదనే నిబంధనను తుంగలో తొక్కి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా, ఉప్పల్ మండలం, నాగోల్ పరిధిలోని సర్వే నెంబర్ 30లో కేఎసఆర్ ఇన్ఫ్రా అధినేత కె. సురేష్ కుమార్ చేపట్టిన అక్రమ నిర్మాణాలకు ఎల్బీనగర్ జోనల్ ఆఫీస్ అధికారులు ఎర్రటి తివాచీ పరిచారు.

- Advertisement -

గతంలో అధికారులు తిరస్కరించిన ఫైళ్లకు, కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ.. రాత్రికి రాత్రే అనుమతులు రావడం పట్ల పెద్ద ఎత్తున చేతులు మారాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఈ వివాదాస్పద స్థలంలో భవన నిర్మాణ అనుమతి కోసం కేఎసఆర్ ఇన్ఫ్రా 2023లోనే జీహెచఎంసీని ఆశ్రయించింది. అయితే, నాటి జోనల్ కమిషనర్ ఎస్. పంకజ నిబంధనల ఉల్లంఘనలను గుర్తించి ఆ ఫైల్‌ను నిర్మొహమాటంగా తిరస్కరిం చారు.. ఆ తర్వాత 2024లో మళ్లీ దరఖాస్తు చేసుకోగా.. లోపాలు ఉన్నాయంటూ ‘షార్ట్ ఫాల’ కింద ఫైల్‌ను పక్కన పెట్టారు.

అనుమతులు లేకుండా ఇక్కడ అక్రమంగా భవన నిర్మాణం చేపడుతున్నారంటూ గతంలోనే హైకోర్టులో రిట్ పిటిషన్ (ఔP చీశీ: 14267/2024) దాఖలైంది. ఈ కేసు ఇప్పటికీ న్యాయస్థానంలో పెండింగ్‌లోనే ఉంది. ఇటు కేఎసఆర్ ఇన్ఫ్రా వారు కూడా 2025లో మరో రిట్ పిటిషన్ (ఔP చీశీ: 9297/2025) దాఖలు చేశారు, అది కూడా విచారణలోనే ఉంది. న్యాయస్థానంలో వివాదం తేలకముందే, సబ్-జూడిస్ అంశాలపై అధికారులు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం మున్సిపల్ చట్టాల ఉల్లంఘనే కాకుండా, కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మున్సిపల్ నిబంధనల ప్రకారం ఖాళీ స్థలాన్ని పరిశీలించి, ప్లాన్ ఆమోదించాకే నిర్మాణం చేపట్టాలి. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది.2024లోనే అక్రమంగా పూర్తయిన ఒక భవనానికి (రెండు బ్లాకులు), ఈ ఏడాది మార్చి 7, 2026న బిల్డింగ్ పర్మిట్ (నెంబర్: 3092/జీహెచెంసీ/ఎస్.డబ్ల్యూబీపీ/ఎల్బీఎన్ 2/2026) జారీ చేశారు. అంటే “ముందు ఇల్లు కట్టేయ్.. తర్వాత పర్మిషన్ ఇస్తాం” అనే సరికొత్త సంస్కృతికి అధికారులు తెరలేపారు.అంతటితో ఆగకుండా, మే 16, 2026న అదే భవనానికి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ (నెంబర్: 017196/ఎం ఎం సి/00383/ఎస్ డబ్ల్యు ఓ సి/ఎల్బీ 2/2026) కూడా చకచకా ఇచ్చేశారు.

క్షేత్రస్థాయిలో భవనం ఇంకా అసంపూర్తిగా ఉంటే, దానికి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఎలా ఇస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.అదే రోజు (16-05-2026) మరో కొత్త ఫైల్ (నెంబర్: 013831/జీ.హెచ్.ఎం.సి./06319/ఎస్.డబ్ల్యు.బీ.పీ./ఎల్బీ నన్ 2/2026, పర్మిట్ నెంబర్: 3766) ద్వారా ఇంకొక భవనానికి కూడా అనుమతులు మంజూరు చేయడం అధికారుల ‘అతి ఉత్సాహాన్ని’ స్పష్టం చేస్తోంది.

శాంక్షన్ ప్లాన్ ప్రకారం కాకుండా, ఒక ఫ్లోర్ లో నిర్మించాల్సిన యూనిట్ల కంటే ఎక్కువ యూనిట్లను కేఎసఆర్ ఇన్ఫ్రా ఇష్టారాజ్యంగా నిర్మించింది. ఈ భవనానికి అసలు అనుమతులు ఎలా లభించాయో ఉన్నతాధికారులకే తెలియాలి.

ఓపెన్ స్పేస్ జోన్ పరిరక్షణపై ఒకవైపు ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ పచ్చదనాన్ని పెంపొందిస్తుంటే, క్షేత్రస్థాయిలో మాత్రం ఎల్బీనగర్ జోనల్ అధికారులు నిబంధనలను తుంగలో తొక్కుతూ అక్రమ కట్టడాలకు ఊపిరిపోస్తున్నారు. ఈ వ్యవహారంపై విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ బ్యూరో ఉన్నత స్థాయి విచారణ జరిపి, బాధ్యులైన బిల్డర్, మున్సిపల్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అధికారులు ఇచ్చిన అనుమతుల వివరాలు :

  1. ఫైల్ నెంబర్ : 013831/జీ.హెచ్.ఎం.సి. /06319/ఎస్.డబ్ల్యు.బీ.పీ./ఎల్బీ ఎన్ 2/2026..
    పర్మిట్ నెంబర్ : 3766/జీహెచెంసీ /ఎస్ డబ్ల్యు బీపీ /ఎల్బీ ఎన్ 2/ 2026..
    పర్మిషన్ ఇచ్చిన తేదీ : 16-05-2026..
  2. ఫైల్ నెంబర్ : బిల్డింగ్ పర్మిట్ నెంబర్ : 3092/ జీహెచెంసీ / ఎస్.డబ్ల్యు.బీ.పీ. / ఎల్బీ ఎన్ 2/2026
    పర్మిషన్ డేట్ : 07-03-2026..
    ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ నెంబర్ : 017196/ఎంఎంసి /00383/ఎస్ డబ్ల్యు ఓసి/ ఎల్బీ 2 /2026
    ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చిన తేదీ.. : 16-05-2026..

జవాబు లభించాల్సిన కొన్ని ప్రశ్నలు :

  1. ఓపెన్ స్పేస్ లో నిర్మాణాలు చేయకూడదు.. అలా నిర్మాణం అయిన బిల్డింగ్ కి ఎలా పర్మిషన్ ఇస్తారు..?
  2. అసంపూర్తిగా వున్న బిల్డింగ్ కి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఎలా ఇస్తారు..?
  3. బిల్డింగ్ శాంక్షన్ ప్లాన్ ప్రకారం కాకుండా ఒక ఫ్లోర్ కి కట్టవలసిన యూనిట్లకన్నా ఇష్టారాజ్యంగా ఎక్కువ యూనిట్లు నిర్మించింది.. వాటికి పర్మిషన్లు ఎలా వస్తాయి..?
  4. ఒక బ్లాక్ కి ఇంకో బ్లాక్ కి మధ్యలో కనెక్టివిటీ నిర్మించారు.. ఇలా కనెక్టివిటీ వున్నదానికి పర్మిషన్ ఎలా ఇస్తారు..
    ఈ అక్రమ నిర్మాణాలపై మరిన్ని వివరాలతో, ఆధారాలతో మరో కథనం ద్వారా వెలుగులోకి తీసుకుని రానుంది

“ఆదాబ్ హైదరాబాద్”.. “మా అక్షరం అవినీతిపై అస్త్రం”..

- Advertisement -
RELATED ARTICLES

Latest News