Monday, May 4, 2026
Homeరంగారెడ్డిComplaints | ప్రజావాణికి(89) ఫిర్యాదులు..!

Complaints | ప్రజావాణికి(89) ఫిర్యాదులు..!

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి (89) ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదు దారులు తమ సమస్యలను జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) చంద్రారెడ్డికి విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించే వినతులను సంబంధిత శాఖల జిల్లా అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

- Advertisement -

రెవెన్యూ శాఖ– 24, ఇతర శాఖలు – 65, మొత్తం 89 దరఖస్తులు అందాయి.

అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) కిరణ్మయి మాట్లాడుతూ ఈ నెల 4వ తేదీ నుండి ప్రారంభమైన రైతు వారోత్సవాలను జిల్లాలో విజయవంతంగా నిర్వహించాలని, రైతులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పథకాన్ని వివరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అదే విధంగా జనాభా గణన-2027 కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లాలోని ప్రతి ఒక్కరు స్వీయ గణనలో పాల్గొని వారి యొక్క వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.

స్వీయగణన ఆన్ లైన్ పోర్టల్ (se.census.gov.in) వెబ్ సైట్ ను సందర్శించి సెల్ఫ్ డిక్లరేషన్ ఐడి పొందాలని, ఏప్రిల్ 26 నుండి ప్రారంభమయిన ఈ స్వీయగణన కార్యక్రమం మే 10 వరకు జరుగుతుందని, ప్రతి ఒక్కరూ స్వీయ గణన ఆన్ లైన్ పోర్టల్ ద్వారా తమ వివరాలను నమోదు చేయాలని అన్నారు. స్వీయ గణన లో గుర్తించబడిన ఉద్యోగులు సర్వే నిమిత్తం ఇంటికి వచ్చినపుడు మీ ఐడి వివరాలు తెలియపరచాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News