Homeరంగారెడ్డిInquiry | కానిస్టేబుల్ మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి

Inquiry | కానిస్టేబుల్ మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి

  • సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్ర చారీ
  • సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ముత్యాల యాదిరెడ్డి

మంగళవారం రాత్రి ఎల్బి నగర్ ఎసిపి కార్యాలయంలో విధుల్లో ఉన్న కానిస్టేబుల్ జర్పుల సాయికుమార్ ఆత్మహత్య చేసుకోవటం పై హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్ర చారీ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ముత్యాల యాదిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం నాడు విడుదల చేసిన ప్రకటనలో వారు మాట్లాడుతూ పోలీస్ శాఖలో కింది స్థాయి ఉద్యోగుల పైన అధిక పని ఒత్తిడి ఉంటుందని, దానికి తోడు కొంత మంది అధికారుల వేధింపులు కూడా వెలుగులోకి వస్తున్నాయని అన్నారు.

ఎంతో భవిష్యత్తు ఉన్న సాయికుమార్ ఇంత చిన్న వయసులో విధుల్లో ఉండగానే ఏసిపి కార్యాలయంలో ఉరి పెట్టుకొని చనిపోవటం అనేక అనుమానాలకి దారితీస్తుందని వెంటనే సాయికుమార్ ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేపట్టి కుటుంబ సభ్యుల అనుమానాలని నివృత్తి చేయాలనీ అన్నారు. అలాగే అతని కుటుంబానికి 50 లక్షలు ఇచ్చి ఆదుకోవాలని, కుటుంబంలో ఒకరికి తగిన ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, ఉండటానికి ఇల్లు కట్టించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News