సిద్దిపేట జిల్లా(Siddipet District) కొండపాక మండలం(Kondapaka mandal) మర్పడగ గ్రామంలోని(Marpadaga Village) శ్రీ విజయదుర్గా సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో(Sri Vijaya Durga Sametha Santhana Mallikarjuna Swamy Kshetram) మంగళవారం రోజున వైకుంఠ చతుర్ధశి(Vaikuntha Chaturdashi) వేడుకలు ఘనంగా జరిగాయి ఉదయం ఆరున్నర గంటలకు విజయ దుర్గా మాతకు విశేష పంచామృత ఫలరస అభిషేకం నిర్వహించి పట్టువస్త్రాలతో అలంకరించారు

అనంతరం సంతాన మల్లికార్జున స్వామి వారికి రుద్రాభిషేకం సుబ్రహ్మణ్య స్వామి కి విశేష పంచామృత ఫలరస అభిషేకం నిర్వహించారు మహిళలు ఆలయ ప్రాంగణం లోని ఉసిరి చెట్టు వద్ద కార్తీక దీపాలు వెలిగించి దీపదానం చేసుకున్నారు భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు కార్తీక పౌర్ణమి(Kartik Purnima) పర్వదినాన్ని పురస్కరించుకుని సాయంత్రం 6 గంటల నుండి కార్తీక దీపోత్సవం జరుగుతుందని అనంతరం జ్వాలా తోరణం ఉంటుందని క్షేత్ర నిర్వాహకులు చెప్పెల హరినాథశర్మ తెలిపారు.జ్వాలా తోరణం ద్వారా ఉత్సవ మూర్తుల పల్లకీ సేవ అనంతరం భక్తులు జ్వాలాతోరణం దాటాలని తద్వారా నరక బాధలు ఉండవని ఆయన తెలిపారు భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని దైవ కృప పొందాలని సూచించారు
