కాఫీ వల్ల ఒంటి(Body)కి మంచే జరుగుతుంది. ముఖ్యంగా కాలేయం (Liver) ఆరోగ్యం(Healthy)గా ఉండటానికి కాఫీ ఉపయోగపడుతున్నట్లు అధ్యయనాల్లో (Studies) తేలింది. డయాబెటిస్(Diabetes), స్ట్రెస్ (Stress) తగ్గుతాయి. మత్తును వదిలిస్తుంది. శరీరం హుషారుగా ఉండేలా చేస్తుంది. కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants) ఉంటాయి. వీటితోపాటు కొన్ని రసాయన మిశ్రమాలు (Chemical mixtures) కూడా లభిస్తాయి. ఇవి కాలేయంలో వాపు రాకుండా నివారిస్తాయి. గ్లూకోజ్(Glucose)ను విడగొట్టడం ద్వారా కాలేయంలో కొవ్వు (Fat) పేరుకుపోకుండా చూస్తుంది. దెబ్బతిన్న కణాలు (Cells) శరీరం నుంచి బయటికి వెళ్లిపోయేలా చేస్తుంది. దీంతో కాలేయం భేషుగ్గా పనిచేస్తుంది. కాలేయం త్వరగా గట్టిపడకుండా రక్షిస్తుంది. హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్‌తో బాధపడేవారికి కాఫీ మేలు చేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇన్సులిన్(Insulin)కు కణాలు బాగా స్పందించేలా కాఫీ ఉపకరిస్తుంది.
