యూకే(UK)లో వ్యక్తిగత పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబుతో.. లండన్(London)లోని భారత హైకమిషనర్ (Indian High Commissioner) విక్రమ్ దొరైస్వామి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. యూకేలోని వివిధ యూనివర్సిటీలు (Universities) ఏపీ(AP)తో నాలుగు అంశాల్లో భాగస్వామ్యం (Sharing) ఏర్పాటుచేసుకునే అంశంపై చర్చించారు. ఏపీలో ఆయా వర్సిటీ కేంద్రాలను ప్రారంభించటం, కేంద్రం సహకారంతో జాయింట్ వెంచర్ల (Joint Ventures) ఏర్పాటు, యూనివర్సిటీలతోపాటు విద్యా సంస్థల మధ్య విద్యార్ధుల ఎక్స్ఛేంజ్, లైఫ్ సైన్సెస్, బయో జెనెటిక్స్, ఖనిజాల వెలికితీత, మెటల్స్ రంగాల్లో ఏపీ-యూకే యూనివర్సిటీల మధ్య భాగస్వామ్యాల ఏర్పాటు, ఏఐ, సెమీ కండక్టర్, స్పేస్ టెక్నాలజీ, కోర్ ఇంజనీరింగ్, మెరైన్ ఇండస్ట్రీ 4.0లో సహకారం తదితర అంశాల గురించి ఇరువురి మధ్య చర్చ జరిగింది.
CM ChandraBabu | భారత హైకమిషనర్ భేటీ
RELATED ARTICLES
- Advertisment -
