Thursday, May 21, 2026
Homeమెదక్‌Subsidy | రాయితీపై జనుము విత్తనాల పంపిణీ

Subsidy | రాయితీపై జనుము విత్తనాల పంపిణీ

సిద్దిపేట జిల్లా కుకునూరు పల్లి మండలంలోని అగ్రోస్ రైతు సేవా కేంద్రంలో గురువారం కొండపాక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులకు 50 శాతం రాయితీపై పచ్చిరొట్ట జనుము విత్తనాలను పంపిణీ చేశారు. రైతుల కోసం మొత్తం 45 క్వింటాళ్ల జనుము విత్తనాలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పచ్చిరొట్ట ఎరువుల సాగు ద్వారా నేల భూసారం పెరిగి పంటలకు అధిక దిగుబడులు లభిస్తాయని పేర్కొన్నారు. అనంతరం మండల వ్యవసాయ అధికారి గోవిందరాజు మాట్లాడుతూ 40 కిలోల జనుము బస్తా ధర రూ.3115గా నిర్ణయించామని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విత్తనాల కోసం రైతులు పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, సెల్‌ఫోన్ నంబర్‌తో రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈవోలు శ్రీహరి, రమ్యశ్రీతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News