Homeకరీంనగర్Arrest | జగిత్యాల మిస్సింగ్ కేసులో కీలక మలుపు

Arrest | జగిత్యాల మిస్సింగ్ కేసులో కీలక మలుపు

  • క్రిప్టో పెట్టుబడులు.. డబ్బుల లావాదేవీలే వివాదానికి కారణం
  • ఏడుగురు నిందితుల అరెస్ట్‌.. కారు, మూడు మొబైళ్లు ఫోన్లు స్వాధీనం

జగిత్యాల జిల్లాలో నమోదైన మిస్సింగ్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. క్రిప్టో కరెన్సీ(Crypto Currency) పెట్టుబడులు, డబ్బుల లావాదేవీలకు సంబంధించిన వివాదమే కిడ్నాప్(Kidnap), దాడికి దారితీసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్(Arrest) చేసి రిమాండ్‌కు తరలించినట్లు జగిత్యాల డీఎస్పీ పురుషోత్తం రెడ్డి(DSP Purushotham Reddy) తెలిపారు.

కళ్లకు గంతలు కట్టి కిడ్నాప్‌.. కత్తితో బెదిరింపులు

చల్గల్ గ్రామానికి చెందిన మారుతిని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేసి, కళ్లకు గంతలు కట్టి గుర్తుతెలియని ప్రాంతానికి తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం కత్తితో బెదిరించి డబ్బులు చెల్లించడంతో పాటు ఇంటి రిజిస్ట్రేషన్ చేయాలని ఒత్తిడి చేసినట్లు బాధితుడి భార్య లావణ్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు ఆధారంగా జగిత్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో క్రిప్టో పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివాదమే ఘటనకు నేపథ్యంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు డీఎస్పీ వెల్లడించారు.

- Advertisement -

జగిత్యాల బైపాస్ వద్ద అనిల్ రావు, వంశీకృష్ణ, నిఖిల్, దీక్షిత్, రహేమాన్, సాయి, జగదీశ్వర్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్ని వారి వద్ద నుంచి మూడు మొబైల్ ఫోన్లు, ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అరెస్ట్ చేసిన ఏడుగురు నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు జగిత్యాల డీఎస్పీ పురుషోత్తం రెడ్డి వెల్లడించారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News