Homeకరీంనగర్Nemuri Bhomaiah | కాంగ్రెస్ పార్టీ జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షుడిగా నేమురి భూమయ్య

Nemuri Bhomaiah | కాంగ్రెస్ పార్టీ జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షుడిగా నేమురి భూమయ్య

  • పార్టీ కోసం చేసిన సేవలకు గుర్తింపు.. జిల్లా స్థాయిలో కీలక బాధ్యతలు

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన నేమురి భూమయ్యను (Nemuri Bhomaiah) కాంగ్రెస్ పార్టీ జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించారు. ఈ సందర్భంగా ఆయనకు నియామక పత్రాన్ని గాజంగి నందయ్య అందజేశారు.

Nemuri Bhumayya Appointed Jagtial District Congress Vice President 2

కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి, బలోపేతం కోసం గత కొన్ని సంవత్సరాలుగా నేమురి భూమయ్య (Nemuri Bhomaiah) అందించిన సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. గతంలో ఆయన కోరుట్ల మండల ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడిగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా, జిల్లా ప్రధాన కార్యదర్శిగా వివిధ బాధ్యతలు నిర్వహించారు. పార్టీ కోసం ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా తాజాగా జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షుడిగా అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు.

- Advertisement -

తన నియామకానికి సహకరించిన కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జ్, రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావు,కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు కృష్ణ రావు,తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు జువ్వాడి శేఖర్ రావు,కోరుట్ల పట్టణ అధ్యక్షుడు తిరుమల గంగాధర్‌లకు నేమురి భూమయ్య ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

తనపై నమ్మకం ఉంచి జిల్లా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని భూమయ్య పేర్కొన్నారు. (https://epaper.aadabhyderabad.in/) (Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News