Homeఆంధ్రప్రదేశ్Rammohan Naidu | ఏపీలో మరిన్ని కొత్త విమానాశ్రయాలు..

Rammohan Naidu | ఏపీలో మరిన్ని కొత్త విమానాశ్రయాలు..

  • పలు ప్రాంతాల్లో భూసేకరణ పూర్తి..
  • వెల్లడించిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు..

ఏపీలో కొత్త విమానాశ్రయాలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు(Rammohan Naidu) వెల్లడించారు. శ్రీకాకుళం, కుప్పం, నాగార్జున సాగర్ సమీపంలో, అమరావతి వంటి ప్రాంతాల్లో ఈ నూతన విమానాశ్రయాలు రానున్నాయని చెప్పారు. ఇప్పటికే శ్రీకాకుళం, కుప్పం ఎయిర్‌పోర్టులకు భూసేకరణ ప్రక్రియ పూర్తయిందని మంత్రి స్పష్టం చేశారు. విశాఖపట్నంలో జరిగిన సీఐఐ సదస్సులో ఆయన మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంతో ఉత్తరాంధ్ర ప్రాంతం ఒక మినీ ఎకనామిక్ సిటీగా రూపాంతరం చెందనుందని కేంద్ర మంత్రి అన్నారు. ఈ ఎయిర్‌పోర్టు ఈ ప్రాంత అభివృద్ధికి ఒక చోదకశక్తిగా పనిచేస్తుందని, వలసలను నివారించడంలో కీలకపాత్ర పోషిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రలో భారీ పారిశ్రామిక అభివృద్ధి జరగనుందని, భోగాపురం విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణంగా నిలుస్తుందని ఆయన అభివర్ణించారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ‘విశాఖ ఎకనామిక్ రీజియన్’ కూడా త్వరలోనే వాస్తవరూపం దాల్చనుందని రామ్మోహన్ నాయుడు(Rammohan Naidu) తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News