Homeకరీంనగర్CM Revanth Reddy visit | సీఎం పర్యటన.. చిరు వ్యాపారులపై భారం!

CM Revanth Reddy visit | సీఎం పర్యటన.. చిరు వ్యాపారులపై భారం!

  • దూరంలోని దుకాణాలకు తాళాలు.. కలెక్టరేట్ గేటు ముందే హోటల్, పాన్‌షాపులు!
  • ఒక్కరోజు ఆదాయం పోయినా.. కిరాయి మాత్రం తప్పదాయే!

నూతన కలెక్టరేట్‌ భవన ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరుకానున్న (CM Revanth Reddy visit) నేపథ్యంలో భద్రతా చర్యల పేరుతో పలు చిన్న హోటళ్లు, టీ స్టాళ్లు, చిరు వ్యాపార దుకాణాలను మూసివేయిస్తున్న అధికారుల తీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సీఎం పర్యటన సందర్భంగా భద్రతా చర్యలు అవసరమే అయినా.. నిబంధనలు అందరికీ ఒకేలా అమలవుతున్నాయా? అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కలెక్టరేట్‌కు దూరంగా ఉన్న చిన్నచిన్న హోటళ్లు, టీ దుకాణాలను మూసివేయిస్తుండగా.. కలెక్టరేట్ ప్రధాన గేటు సమీపంలోని న్యూ రాజా టిఫిన్స్, సిరి హోటల్‌ తెరిచి ఉండటం, భవనం ముందే పాన్‌షాపులు కొనసాగుతుండటం స్థానికుల దృష్టిని ఆకర్షిస్తోంది.భద్రతా కారణాలతో దుకాణాలు మూసివేయాల్సి వస్తే.. కలెక్టరేట్‌ సమీపంలోని వ్యాపారాలకు ఏ నిబంధనల ప్రకారం అనుమతి ఇచ్చారన్న ప్రశ్నకు అధికారులు సమాధానం చెప్పాల్సి ఉంది.

ఒక్కరోజు నష్టం.. భారం మాత్రం నెలంతా!
రోజువారీ ఆదాయంపైనే ఆధారపడి జీవించే చిరు వ్యాపారులకు ఒక్కరోజు దుకాణం మూసివేయడం చిన్న విషయం కాదు. ఆ రోజు వచ్చే ఆదాయం పోతుంది.. కానీ దుకాణం కిరాయి మాత్రం చెల్లించాల్సిందే. విద్యుత్‌ బిల్లు, కుటుంబ ఖర్చులు, పిల్లల చదువులు, అప్పుల వాయిదాలు ఏవీ ఆగవు. పెద్ద వ్యాపార సంస్థలకు ఒక్కరోజు నష్టం భరించే సామర్థ్యం ఉండొచ్చు. కానీ చిన్న టీ కొట్టు, టిఫిన్‌ సెంటర్‌, పాన్‌షాప్‌ నడిపే వ్యక్తికి రోజువారీ సంపాదనే కుటుంబానికి ఆధారం.అందుకే భద్రతా చర్యలు చేపట్టే సమయంలో చిరు వ్యాపారుల ఆర్థిక పరిస్థితిని కూడా అధికారులు పరిగణనలోకి తీసుకోవాలని వ్యాపారులు కోరుతున్నారు.

- Advertisement -

భద్రత అందరికీ.. నిబంధనలు కూడా అందరికేనా?
సీఎం పర్యటన (CM Revanth Reddy visit) సజావుగా సాగేందుకు అధికారులు తీసుకునే చర్యలకు ప్రజలు సహకరించాల్సిందే. అయితే ఒక ప్రాంతంలోని చిన్న దుకాణాలను మూసివేసి.. మరోవైపు కలెక్టరేట్‌ గేటు ముందే వ్యాపారాలు కొనసాగితే సహజంగానే అనుమానాలు తలెత్తుతాయి.భద్రత అందరికీ ఒకటే అయితే.. నిబంధనలు కూడా అందరికీ ఒకేలా ఉండాలి. కలెక్టరేట్‌ సమీపంలోని హోటల్‌, పాన్‌షాపులకు అనుమతులు ఉన్నాయా? ఇతర దుకాణాలను మూసివేయడానికి అనుసరించిన ప్రమాణాలు ఏమిటి? అనే విషయాలపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. సీఎం పర్యటన పేరుతో చిరు వ్యాపారుల పొట్టకొట్టకుండా.. భద్రతా చర్యలు పారదర్శకంగా, సమానంగా అమలు చేయాలన్నదే వ్యాపారుల విజ్ఞప్తి. (https://epaper.aadabhyderabad.in/) (Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News