Homeఆరోగ్యంGreen Gram | పెసలు శరీరానికి ఎంతో అవసరం..

Green Gram | పెసలు శరీరానికి ఎంతో అవసరం..

  • అనేక రకాల పోషకాలను అందిస్తాయి..
  • మలబద్దకం నుంచి ఉపశమనం కలిగిస్తాయి..

శరీరానికి అవసరమైన అద్భుతమైన ఆహార పదార్థాలలో పెసలు ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించాయి. పూర్వీకుల కాలం నుండి వీటిని మన ఆహారంలో భాగంగా ఉపయోగిస్తున్నారు. ఆధునిక వైద్యులు కూడా రోజువారీ ఆహారంలో పెసలను చేర్చుకోవాలని బలంగా సిఫార్సు చేస్తున్నారు. పెసలు (Green Gram) కేవలం రుచికరమైనవే కాకుండా, మన శరీరానికి అవసరమైన అనేక రకాల పోషకాలను అందిస్తాయి. జ్వరం, మలబద్ధకం వంటి సాధారణ అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలిగించడంలో ప్రమాదకరమైన వ్యాధుల నుండి రక్షణ కల్పించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.

పెసలు (Green Gram) ప్రోటీన్లకు అద్భుతమైన మూలం. ఈ ప్రోటీన్లు శరీర నిర్మాణం, కండరాల పనితీరు మెరుగుదల, దెబ్బతిన్న కణజాలాల మరమ్మత్తుకు అత్యవసరం. అంతేకాకుండా, ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. పెసలను నీటిలో నానబెట్టి, మొలకెత్తించి తినడం.. లేదా ఉడికించి తినడం వల్ల వాటి పోషక విలువలు మరింత పెరుగుతాయి. మొలకెత్తిన పెసలలో విటమిన్లు A, B, C, E లు అధికంగా ఉంటాయి. అలాగే, పొటాషియం, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, కాపర్, ఫోలేట్ వంటి ముఖ్యమైన ఖనిజాలు, డైటరీ ఫైబర్‌లు పుష్కలంగా లభిస్తాయి.

- Advertisement -

పెసలలో (Green Gram) కేలరీలు తక్కువగా ఉంటాయి. అందువల్ల, బరువు పెరుగుతామన్న భయం లేకుండా వీటిని నిర్భయంగా తినవచ్చు. వాస్తవానికి, పెసలు బరువు తగ్గడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఇవి శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించి, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. ఐరన్ లోపంతో బాధపడేవారు తమ రోజువారీ ఆహారంలో పెసలను చేర్చుకోవడం ద్వారా రక్తహీనత వంటి వ్యాధుల నుండి దూరంగా ఉండవచ్చు. పెసలను రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవడం వల్ల కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది, ఆకలి నియంత్రించబడుతుంది, తద్వారా బరువు అదుపులో ఉంటుంది. (https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News