- 31 వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్స్ ఫుల్..
- అన్ని సౌకర్యాలు కల్పించిన టీటీడీ..
- దర్శనానికి సుమారు 12 గంటలు సమయం..
తిరుమల శ్రీవారి దర్శనానికి (Tirumala Darshan) భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం ఉదయం నాటికి, శ్రీవారి దర్శనం కోసం 31 వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
మంగళవారం ఒక్కరోజే 73,629 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 27,525 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 5.33 కోట్లుగా నమోదైంది. అదేవిధంగా, టీటీడీ నిన్న 3.91 లక్షల లడ్డూలను భక్తులకు విక్రయించింది. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సత్రంలో 1.75 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. తిరుమలలోని అశ్విని ఆసుపత్రిలో 3,334 మందికి వైద్య సేవలు అందించినట్లు అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ నేపథ్యంలో టీటీడీ తగిన ఏర్పాట్లు చేస్తోంది. (https://epaper.aadabhyderabad.in/)(Youtube)
