Homeక్రైమ్ వార్తలుSkull Fracture | కీలక విషయాలు వెలుగులోకి..

Skull Fracture | కీలక విషయాలు వెలుగులోకి..

  • కెప్టెన్ స్మిత్ మచ్చర్ పుర్రెకు ఫ్యాక్చర్..(Skull Fracture)
  • సౌదీ నుంచి చికిత్స కోసం యూఏఈ కి తరలింపు..

ఫ్లైదుబాయ్ విమానంలో కో పైలట్‌ దాడిని ఎదుర్కొని ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తలకు తీవ్ర గాయమై, పుర్రెకు ‘డిప్రెస్డ్ ఫ్రాక్చర్ కావడంతో(Skull Fracture) సౌదీ అరేబియాలోని తబుక్‌ లో అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించి, దెబ్బతిన్న పుర్రె భాగాన్ని వైద్యులు పునర్నిర్మించారు. తర్వాత స్మిత్ మచ్చర్‌ను సౌదీ అరేబియా నుంచి యూఏఈకి ఎయిర్‌లిఫ్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన అబుదాబిలో చికిత్స పొందుతున్నారు. దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో సెప్టెంబర్ 30న ఈ ఘటన జరిగింది.

విమానం గాల్లో ఉండగానే కో-పైలట్ హమ్మామ్ అల్-హమ్మామీ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై పికాక్స్ గొడ్డలితో వెనుక నుంచి నాలుగైదు సార్లు కొట్టాడు. దాడిలొ మచ్చర్‌కు జరిగింది సాధారణ ఫ్రాక్చర్ కాదు. పుర్రె ఎముకలో కొంత భాగం లోపలికి ఒత్తుకుపోయింది. ఆ పరిస్థితిని ‘డిప్రెస్డ్ స్కల్ ఫ్రాక్చర్’ అంటారని వైద్యులు తెలిపారు. మెదడుపై ఒత్తిడి పెంచే ప్రమాదం ఉండటంతో తబుక్‌లో విమానం ల్యాండ్ అయిన తర్వాత మచ్చర్‌కు వెంటనే శస్త్రచికిత్స చేసారు. సౌదీలో అత్యవసర శస్త్రచికిత్స అనంతరం మచ్చర్‌ను యూఏఈకి తరలించారు. ప్రస్తుతం అబుదాబిలో వైద్యుల నిరంతర పర్యవేక్షణలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News