( రిటైర్డ్ సూపెరిండేంట్ ఇంజినీర్అయినా పైళ్ల ధర్మారెడ్డికి నేషనల్ హై వేస్ లో
చీఫ్ ఇంజినీర్ గా బాధ్యతలు అప్పగించడం వెనుక ఉన్న మతలబేంటి..?) (డెక్ )
- అర్హతగల అనుభవజ్ఞులైన ఇంజనీర్లు లేరా..
- కనీస ప్రమాణాలు పాటించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం..
- నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా వెలుస్తున్న పెట్రోల్ బంకులు..
- ఈ అక్రమాలకు ప్రభుత్వ పెద్దల అండదండలు ఉన్నాయా?
- నల్లగొండ బైపాస్ రోడ్డు పై పిర్యాదులు అందిన పట్టించుకోని వైనం..
- తనిఖీకి వచ్చిన అధికారులను తప్పుదోవ పట్టించడం ఏమిటి?
- వివాదాస్పద అధికారి ధర్మారెడ్డికి, కాంట్రాక్టర్ సిండికేట్‌కు మధ్య చీకటి ఒప్పొందం..?
- ప్రజల సొమ్ముతో చేపడుతున్న ఈ భారీ అభివృద్ధి పనుల్లో పారదర్శకత ఎక్కడ?
- అక్రమాలపై తక్షణమే ప్రభుత్వం స్పందించాలి..
నిపుణులైన, అర్హతగలిగిన ప్రభుత్వ అధికారులను పక్కనబెట్టి.. రిటైర్డ్ అయిన అధికారులను కాంట్రాక్టు పద్దతిలో నియమించుకోవడం ఒక తప్పిదం అయితే.. అలాంటి వారికి వేలకోట్ల విలువైన ప్రజోపయోగ పనులు అప్పగించడం మరో తప్పిదం.. పోనీ అలా అప్పగించిన పిమ్మట ఆ పనులపై పర్యవేక్షణ ఉందా..? అంటే అదీలేదు.. పనులు నాణ్యతగా జరుగుతున్నాయా అంటే చెప్పలేము.. పైగా కీలకమైన జాతీయ రహదారులు, మౌలిక వసతుల ప్రాజెక్ట్.. ఎంతో పకడ్బందీగా నిర్వహించాల్సి ఉండగా ఆ పనులను గాలికొదిలేయడం పట్ల అధికారుల చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తుంది..
పైగా ఈ పనుల నిర్వహణ వెనుక రాజకీయ పెద్దల హస్తం ఉన్నట్లు కూడా తెలుస్తోంది.. రిటైర్డ్ అధికారి పైళ్ల ధర్మారెడ్డికి కాంట్రాక్ట్ పద్దతిలో బాధ్యతలు ఇవ్వడం.. సుమారు రూ. 15,000 కోట్ల పనులను అప్పగించడం.. ఆ వ్యవహారంపై విమర్శలు వస్తుండటంపై హై లెవల్ కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్స్ వెలువెత్తుతున్నాయి.. ఈ అవినీతి(Corruption) వ్యవహారంపై ఇదివరకే ఆదాబ్ హైదరాబాద్ ఆధారాలతో సహా పలుమార్లు కథనాలను ప్రచురించడం కూడా జరిగింది.. అయినాసరే ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తెలంగాణా ప్రభుత్వం తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి..

- రూ. 15,000 కోట్లపనుల్లో కుంభకోణంపై హైలెవల్ కమిటీ విచారణ జరగాలి..
- ఒక ‘స్వతంత్ర నిపుణుల కమిటీ’ ని నియమించాలి..
- ఎల్బీనగర్ – మల్కాపురం రహదారి విస్తరణ పనుల్లో నాసిరకం ..
- రోడ్లు, డ్రైనేజీలు, సర్వీస్ రోడ్ల నిర్మాణంలో నాణ్యత గాలికి..
- రూ. 15,000 కోట్లపనుల్లో కుంభకోణంపై హైలెవల్ కమిటీ విచారణ జరగాలి..
- ఒక ‘స్వతంత్ర నిపుణుల కమిటీ’ ని నియమించాలి..
- ఎల్బీనగర్ – మల్కాపురం రహదారి విస్తరణ పనుల్లో నాసిరకం ..
- రోడ్లు, డ్రైనేజీలు, సర్వీస్ రోడ్ల నిర్మాణంలో నాణ్యత గాలికి..
తెలంగాణ రోడ్లు, భవనాల శాఖలో రిటైర్డ్ అధికారుల హవా నూతన సర్కార్ కొలువుదీరిన తర్వాత కూడా నిరాటంకంగా కొనసాగుతుండటం తీవ్ర చర్చనీయాంశమైంది. వేల కోట్ల రూపాయల ప్రజాధనంతో ముడిపడిన కీలకమైన జాతీయ రహదారులు, మౌలిక వసతుల ప్రాజెక్టుల పర్యవేక్షణను అసిస్టెంట్ ఇంజినీర్ స్థాయి నుంచి ఎదిగి సూపరెండెంట్ ఇంజనీర్ గా రిటైర్ అయిన పైళ్ల ధర్మారెడ్డికి అప్పగించడం వెనుక అసలు మతలబు ఏమిటనే ప్రశ్నలు ఇప్పుడు మేధావుల నుంచి తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి.
అర్హులను పక్కనబెట్టి.. ఔట్సోర్సింగ్ ముసుగులో పెత్తనమేమిటి?
టి.జీ.పీ.ఎస్.సి. ద్వారా కష్టపడి ఉద్యోగాలు సాధించి, సర్వీసులో ఉన్న ఎంతో మంది నిష్ణాతులైన, అర్హులైన రెగ్యులర్ ఇంజినీర్లు ఉండగా.. వారిని పక్కనబెట్టి పదవీ విరమణ పొందిన ధర్మారెడ్డికి నేషనల్ హైవేస్ చీఫ్ ఇంజినీర్ హోదాను ఔట్సోర్సింగ్ / కాంట్రాక్ట్ పద్ధతిలో కట్టబెట్టడం విస్మయానికి గురిచేస్తోంది. సుమారు రూ. 15,000 కోట్ల నుంచి రూ. 50,000 కోట్ల బడ్జెట్ ప్రాజెక్టులు కలిగిన ఈ శాఖలో, రిటైర్డ్ అధికారి చేతిలో కీలక బాధ్యతలు పెట్టడం వల్ల నిబంధనలకు తిలోదకాలు ఇస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పైళ్ల దర్మారెడ్డి ఎక్సక్యూటివ్ ఇంజనీర్ కొనసాగుతున్న సమయంలోనాసిరకం పనులు.. :
ఎల్బీనగర్ – మల్కాపురం రహదారి:
ఈ ప్రాజెక్టు పనులు మొదలై సుమారు నాలుగు సంవత్సరాలు గడిచిన సర్వీస్ రోడ్లు డ్రైనేజీ వ్యవస్థలు అస్తవ్యస్తంగా మారడం, వర్షాకాలంలో ఫ్లైఓవర్లపై నీరు నిలిచిపోవడం వంటి సమస్యలు ప్రజలను వేధిస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
నల్లగొండ బైపాస్ రోడ్డు కుంభకోణం :
కేంద్ర ప్రభుత్వ నిధులతో ఎస్.ఎల్.ఎం.ఐ. ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జరుగుతున్న బైపాస్ రోడ్డు నిర్మాణంలో భారీ అక్రమాలు వెలుగుచూశాయి. నిబంధనలకు విరుద్ధంగా చెరువులు, రిజర్వాయర్ల నుంచి (కందనపల్లి, దోమలపల్లి, పానగల్ ఉదయసముద్రం తదితర ప్రాంతాల్లో) 40 నుంచి…(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
