Homeరంగారెడ్డిAbdullapurmet | కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా బింగి దేవదాస్ గౌడ్.

Abdullapurmet | కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా బింగి దేవదాస్ గౌడ్.

ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి(Malreddy Ranga Reddy), రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్లా నర్సింహారెడ్డి చేతుల మీదుగా మంగళవారం సాయంత్రం అబ్దుల్లాపూర్‌మెట్ మండల(Abdullapurmet Mandal) కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియామక పత్రం అందుకున్న బింగి దేవదాస్ గౌడ్(Bingi Devadas Goud).

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

- Advertisement -

నాపై నమ్మకంతో అబ్దుల్లాపూర్‌మెట్ మండల(Abdullapurmet Mandal) కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డికి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్లా నర్సింహారెడ్డికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను, కాంగ్రెస్ పార్టీ నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, మండలంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్తతో కలిసి అంకితభావంతో పనిచేస్తాను అని తెలియజేశారు.

ఈ కార్యక్రమానికి విచ్చేసి నన్ను అభినందించిన, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అబ్దుల్లాపూర్‌మెట్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News