- పదిరోజులుగా తగ్గుముఖం..Gold Prices Surge
- అంతర్జాతీయ మార్కెట్ల బలమైన ధోరణులు..
బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి. గత కొన్ని రోజులుగా తగ్గుతూ సామాన్యుడికి ఊరట కల్పించిన అతి విలువైన లోహాలు ధరలు మళ్లీ పుంజుకున్నాయి (Gold Prices Surge ). స్థానిక కొనుగోళ్లు, అంతర్జాతీయ మార్కెట్ల బలమైన ధోరణులతో సోమవారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర రూ.1,500 ఎగబాకి రూ.1,26,800కి చేరుకున్నది. గత పది రోజులుగా తగ్గుతూ వచ్చిన ధరలు మళ్లీ పెరిగినట్టు అయిందని బులియన్ వర్తకులు వెల్లడించారు. బంగారంతోపాటు వెండి ధరలు కూడా పుంజుకున్నాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్ళు ఊపందుకోవడంతో కిలో వెండి రూ.2 వేలు అందుకొని రూ.1.57 లక్షలకు చేరుకున్నది. అంతకుముందు ఇది రూ.1.55 లక్షలుగా ఉన్నది. ‘అంతర్జాతీయ మార్కెట్లలో లాభాలు, కొనసాగుతున్న పెండ్లిళ్ల సీజన్‌లో నగల కొనుగోళ్లు పెరుగుతాయన్న అంచనాలతో సోమవారం బంగారం ధరలు పైకి కదిలాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. ఇటీవలి ధరల తగ్గుదలతో వినియోగదారులకు బంగారం మరింత ఆకర్షణీయమైన స్థాయికి వచ్చిందని, పెండ్లిళ్ల సీజన్ ముందుకు సాగే కొద్దీ కాలానుగుణ కొనుగోళ్ల ఆసక్తి బలపడుతుందని గాంధీ చెప్పారు.
ధరలు తగ్గిన తర్వాత వినియోగదారుల ఆసక్తి మళ్లీ పెరిగినట్లు గత వారం భారత్, చైనాల్లో వాస్తవ కొనుగోళ్ల డిమాండ్‌లోనూ ఇదే తరహా మెరుగుదల కనిపించిందని ఆయన తెలిపారు. తక్కువ దేశీయ ధరలు తక్కువకు బంగారం కొనాలనుకునే వారిని మళ్లీ వాస్తవ బంగారం కొనుగోళ్లవైపు తీసుకొచ్చాయని చెప్పారుతెలిపారు. రూపాయి స్వల్పంగా బలహీనపడడం కూడా ధరలు పెరగడానికి పరోక్షంగా దోహదం చేసిందన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
