Homeభక్తిJwala Thoranam Ritual | ఆధ్యాత్మిక వేడుక జ్వాలా తోరణం..

Jwala Thoranam Ritual | ఆధ్యాత్మిక వేడుక జ్వాలా తోరణం..

  • కార్తీక పౌర్ణమి రోజు ప్రత్యేకత..Jwala Thoranam Ritual
  • సర్వపాపాలు తొలగుతాయని నమ్మకం..

కార్తిక పౌర్ణమి రోజున శివాలయాల్లో నిర్వహించే ఒక ప్రత్యేకమైన అగ్ని సంబంధిత ఆధ్యాత్మిక వేడుక జ్వాలా తోరణం! శివ కేశవ భేదం లేని పరమ పవిత్రమైన మాసంలో కార్తీక పౌర్ణమి రోజున జరిగే జ్వాలా తోరణ దర్శనం చేస్తే సర్వపాపాలు తొలగుతాయని విశ్వాసం. కార్తిక పౌర్ణమి రోజు ఆచరించే స్నాన, దీప, దానాలతో పాటు కేవలం దర్శించినంత మాత్రాన్నే అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే ఉత్సవం జ్వాలా తోరణం! ఇంతటి మహిమాన్వితమైన ఉత్సవం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. తెలుగు పంచాంగం ప్రకారం కార్తిక శుద్ధ పౌర్ణమి రోజు శివాలయాల్లో నిర్వహించే ప్రధాన ఉత్సవం జ్వాలా తోరణం. ఈ ఏడాది నవంబర్ 24, మంగళవారం సందర్భంగా ఈ రోజు సాయంత్రం శివాలయాల్లో జ్వాలా తోరణం ఉత్సవం వైభవంగా జరుగుతుంది.Jwala Thoranam Ritual

కార్తిక పౌర్ణమి రోజు నిర్వహించే జ్వాలా తోరణం వెనుక రెండు పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి.

- Advertisement -

త్రిపురాసుర సంహారంJwala Thoranam Ritual
పూర్వం త్రిపురాసురులు అనే ముగ్గురు రాక్షసులను పరమేశ్వరుడు కార్తిక పౌర్ణమి రోజునే సంహరించాడు. అందుకే కార్తిక పౌర్ణమికి ‘త్రిపుర పౌర్ణమి’ అనే పేరు కూడా ఉంది. భయంకరమైన రాక్షసులను సంహరించి కైలాసానికి చేరిన తన భర్తకు దిష్టి తగలకూడదని భావించిన ఆ జగన్మాత పార్వతీదేవి ఈ జ్వాలా తోరణాన్ని ఏర్పాటు చేసినట్లు శివ పురాణంలో వివరించి ఉంది. అంతేకాదు ఈ రోజున పరమ శివుడు త్రిపురాసురునిపై సాధించిన విజయానికి చిహ్నంగా తులసి కోట వద్ద 365 వత్తుల దీపాన్ని వెలిగించడం సంప్రదాయం.

హాలాహలం భక్షణంl
దేవ దానవులు అమృతం కోసం చేసిన క్షీరసాగర మథనంలో తొలుత హాలాహలం ఉద్భవించింది. లోకకల్యాణం కోసం పరమేశ్వరుడు ఆ విషాన్ని స్వీకరించి, తన ఉదరంలో ఉన్న లోకాలకు హాని కలగకుండా ఆ గరళాన్ని తన కంఠంలోనే నిలుపుకుని గరళకంఠుడిగా ప్రసిద్ధి చెందాడు. ఈ మహత్తర ఘట్టం తరువాత పరమశివునితో పాటు పార్వతీదేవి కుటుంబ సమేతంగా మూడుసార్లు జ్వాలా తోరణాన్ని దాటినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా జ్వాలా తోరణం విశిష్టత గురించి తెలుసుకుందాం..(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News