Homeఅంతర్జాతీయంMaritime Cyberattacks | కొత్తరంగానికి ఉద్రిక్తతలు..

Maritime Cyberattacks | కొత్తరంగానికి ఉద్రిక్తతలు..

  • అమెరికా – ఇరాన్ మధ్య మరోసారి లుకలుకలు..Maritime Cyberattacks
  • ప్రమాదంలో పడ్డ సముద్ర వాణిజ్యం..

అమెరికా – ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరో కొత్త రంగానికి విస్తరిస్తున్నాయి. అంతర్జాతీయ సముద్ర వాణిజ్యాన్ని లక్ష్యంగా చేసుకుని సైబర్ దాడులు జరుగుతున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చమురు, గ్యాస్, రసాయనాలు సహా కీలక సరుకులను రవాణా చేసే సుమారు 50 వాణిజ్య నౌకలపై సైబర్ దాడులు జరిగినట్లుగా వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం వెల్లడించింది. ఆ కథనం ప్రకారం.. దాడుల వెనుక ఇరాన్ ప్రమేయం ఉందా అనే కోణంలో అమెరికా దర్యాప్తు చేస్తోంది. ఈ దాడుల వెనుక ఇరాన్ ప్రమేయం ఉందా అనే కోణంలో పరిశీలిస్తున్నప్పటికీ, ఇప్పటివరకు బాధ్యులెవరనేది నిర్ధారణ కాలేదు. రష్యా ప్రమేయంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.Maritime Cyberattacks

దాడులకు గురైన కొన్ని నౌకలకు బాంబు బెదిరింపులు, డబ్బులు చెల్లించాలంటూ సందేశాలు వచ్చినట్లు సమాచారం. అమెరికా ఉత్పత్తులను రవాణా చేయవద్దని హెచ్చరిస్తూ సందేశాలు పంపినట్లు దర్యాప్తులో వెల్లడైంది. మరికొన్ని నౌకల కంప్యూటర్ నెట్‌వర్క్‌లలో సిబ్బందికి తెలియకుండానే చొరబాట్లు జరిగినట్లు అనుమానిస్తున్నారు. అమెరికా తీరానికి చేరువలో ఉన్న కనీసం నాలుగు నౌకల వద్ద కోస్ట్ గార్డ్ ప్రత్యేక సైబర్ భద్రతా బృందాలను మోహరించింది. VL Prosperity, Kohaku నౌకల్లోనూ తనిఖీలు చేపట్టినట్లు నివేదిక పేర్కొంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News