- బీజేపీ, ఎస్.ఏ.డీ. తిరిగి దోస్తీ..BJP SAD Alliance
- 2027లో కలిసి పోటీచేయాలని నిర్ణయం..
పంజాబ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుదీర్ఘకాలం మిత్రపక్షాలుగా ఉండి మధ్యలో విడిపోయిన భారతీయ జనతా పార్టీ, శిరోమణి అకాలీదళ్ మళ్లీ చేతులు కలిపాయి. 2027 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. నేడు గురునానక్ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఈ పొత్తును అధికారికంగా ప్రకటించారు. ఈ రోజు నుంచి అకాలీదళ్, జాతీయ ప్రజాస్వామ్య కూటమిలో అధికారిక భాగస్వామిగా ఉంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అమిత్ షా, అకాలీదళ్ అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ పాల్గొన్నారు. అమిత్ షా మాట్లాడుతూ..BJP SAD Alliance
“అకాలీదళ్ బీజేపీకి అత్యంత పాత మిత్రపక్షం. ప్రకాశ్ సింగ్ బాదల్ నాయకత్వంలో మేం ఎన్నో ఎన్నికల్లో కలిసి పోటీ చేశాం. మా బంధం మధ్యలో తెగిపోయినా, ఈ రోజు మళ్లీ పునరుద్ధరించబడుతుండటం చాలా సంతోషంగా ఉంది. అకాలీదళ్ రాకతో ఎన్డీఏ కూటమి పూర్తయింది” అని అన్నారు. ప్రధాని మోదీ, మాజీ ప్రధాని వాజ్‌పేయి, అద్వానీ వంటి నేతలతో ప్రకాశ్ సింగ్ బాదల్‌కు ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ కూటమి ప్రధాన లక్ష్యాలను అమిత్ షా స్పష్టంగా వివరించారు. “పంజాబ్‌ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడం, అవినీతిని సమూలంగా నిర్మూలించడం, రాష్ట్రంలో జాతీయవాద శక్తులను బలోపేతం చేయడం మా ప్రథమ కర్తవ్యాలు” అని ఆయన పేర్కొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
