- ప్రభుత్వ బీమా పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలిIndiramma Family Life Insurance Scheme
- పొద్దుటూరు సర్పంచ్ బండ లక్ష్మీ నరసింహ, పీఏసీఎస్ చైర్మన్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బొల్లారం వెంకట్ రెడ్డి విజ్ఞప్తి
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కుటుంబ భద్రత,ఆర్థిక భరోసా లక్ష్యంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని శంకర్పొ పల్లి మండలం పోద్దుటూరు గ్రామ సర్పంచ్ బండ లక్ష్మీ నరసింహ,శంకర్పల్లి పీఏసీఎస్ చైర్మన్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొల్లారం వెంకట్ రెడ్డి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.సోమవారం పొద్దుటూరు గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు.Indiramma Family Life Insurance Scheme
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం అర్హులైన కుటుంబాలకు భవిష్యత్తులో ఆర్థిక భరోసా కల్పించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా కుటుంబంలోని సంపాదించే వ్యక్తికి అనుకోని ప్రమాదం జరిగినా, మరణించినా ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా బీమా రక్షణ తోడ్పడుతుందని తెలిపారు.ఈ పథకానికి 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగిన వారు అర్హులని, నమోదు సమయంలో కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు,రేషన్ కార్డు,మొబైల్ ఫోన్ నంబర్ వంటి అవసరమైన పత్రాలను తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబ సభ్యుడి వివరాలు నమోదు చేయించుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా బొల్లారం వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమం, కుటుంబాల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరవేయడం ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారుల బాధ్యత అని అన్నారు.గ్రామంలో ఎవరూ ఈ పథకం ప్రయోజనాన్ని కోల్పోకుండా విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.సర్పంచ్ బండ లక్ష్మీ నరసింహ మాట్లాడుతూ.. గ్రామ ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా అవసరమైన పత్రాలతో గ్రామపంచాయతీ కార్యాలయానికి వచ్చి తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు.కుటుంబానికి భద్రత కల్పించే ఈ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి,పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్,వార్డు సభ్యులు,జీపీ బిల్ కలెక్టర్,గ్రామ పెద్దలు, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
