తిరంగాలో తళుక్కుమన్న భారత స్వప్నం ఎర్రకోటపై ఎగిరిన త్రివర్ణం.. కోట్ల గుండెల్లో గర్వాన్ని నింపింది. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగం.. నేటి భారతానికి స్ఫూర్తినిచ్చింది. నిన్నటి పోరాటం నుంచి.. నేటి ప్రగతి వరకు మన ప్రయాణం సాగింది. యువశక్తి సంకల్పంతో.. రేపటి వికసిత్ భారత్కు బాటలు పడ్డాయి. సాంకేతికతలో దూసుకెళ్తూ.. స్వయం సమృద్ధి వైపు అడుగులు వేస్తోంది భారత్, వైవిధ్యంలో ఏకత్వాన్ని చాటుతూ.. ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది భారత్. తిరంగా మన చేతుల్లో జెండా మాత్రమే కాదు.. మన ఆత్మగౌరవానికి ప్రతీక, దేశం కోసం ఒక్క అడుగు వేస్తే.. చరిత్రలో మనకంటూ ఓ స్తానం ఉంటుంది. స్వేచ్ఛను కాపాడటం మన బాధ్యత.. దేశాన్ని నిర్మించడం మన కర్తవ్యం, భారత్ మాతా కీ జై.. జైహింద్!
- పరుశురాం ముస్తాల
- Advertisement -
