- భూగర్భ జలాల పెంపే లక్ష్యంగా సర్పంచ్ చిట్టెంపల్లి శేఖర్ ప్రత్యేక చొరవRainwater recharge pits
- వర్షపు నీటి సంరక్షణకు గ్రామస్థాయిలో కార్యాచరణ
- నీటి వృథాను అరికట్టి భవిష్యత్ అవసరాలకు భరోసా కల్పించేలా చర్యలు
వర్షపు నీటిని ఒడిసిపట్టి (Rainwater recharge pits) భూగర్భ జలాలను పెంపొందించడమే లక్ష్యంగా శంకర్‌పల్లి మండలం మోకిలా గ్రామంలో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామ సర్పంచ్ చిట్టెంపల్లి శేఖర్ ప్రత్యేక చొరవతో ఒకే రోజు 30 ఇంకుడు గుంతల నిర్మాణ పనులను ప్రారంభించారు. నీటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలనే ఉద్దేశంతో గ్రామంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.వర్షాకాలంలో కురిసే వర్షపు నీరు వృథాగా బయటకు వెళ్లకుండా ఇంకుడు గుంతల ద్వారా భూమిలోకి ఇంకేలా చేయడం వల్ల భూగర్భ జలమట్టం పెరిగేందుకు అవకాశం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
భవిష్యత్తులో తాగునీరు,సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఇంటి వద్ద, అనువైన ప్రదేశాల్లో ఇంకుడు గుంతల నిర్మాణాన్ని ప్రోత్సహించనున్నట్లు పేర్కొన్నారు.గ్రామంలో ఒకే రోజు 30 ఇంకుడు గుంతల నిర్మాణాలకు శ్రీకారం చుట్టడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ప్రజల్లో నీటి సంరక్షణపై అవగాహన పెంపొందించడంతో పాటు ప్రతి ఒక్కరూ జలవనరుల పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ గౌండ్ర సత్యం,పీఏసీఎస్ సీఈవో వేణుకుమార్,వార్డు సభ్యులు చేవెళ్ల రాజు, ఎండీ ఆజాం,నాయకులు కావలి సురేందర్,తలారి లక్ష్మణ్,గ్రామ కార్యదర్శి నరసింహ తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
