Thursday, May 21, 2026
Homeకెరీర్ న్యూస్EAMCET | ర్యాంక్ అవసరం లేదు..

EAMCET | ర్యాంక్ అవసరం లేదు..

  • ఇంజినీరింగ్ చదవాలనుకునేవారు నిరాశపడకండి..
  • కెరీర్ గైడెన్స్ కోసం కాలేజ్ మెంటర్ ఒక ఆశాకిరణం..

ప్రతి సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులు ఇంజినీరింగ్ కలలతో ఎప్‌సెట్ పరీక్ష రాస్తున్నారు. అయితే అందరికీ మంచి ర్యాంకులు రావడం సాధ్యం కాదు. కొంతమంది విద్యార్థులు కేవలం కొన్ని మార్కుల తేడాతో మంచి కాలేజీలను కోల్పోతుంటే.. మరికొందరు కౌన్సెలింగ్ ప్రక్రియ, మేనేజ్‌మెంట్ కోటా, ప్రత్యామ్నయ అడ్మిషన్ అవకాశాలపై సరైన అవగాహన లేక నిరాశలోకి వెళ్లిపోతున్నారు. ఇలాంటి విద్యార్థులకు ఇప్పుడు ఆశాకిరణంగా మారుతోంది “కాలేజ్ మెంటర్”. విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ అందించాలనే లక్ష్యంతో రాజశేఖర్ ప్రారంభించిన ఈ సంస్థ.. ఇప్పటివరకు వేలాది మంది విద్యార్థులకు సరైన కాలేజీలు, కోర్సులు ఎంపిక చేయడంలో సహాయం చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు.

ప్రత్యేకంగా ఎప్‌సెట్ ర్యాంకుతో సంబంధం లేకుండా కూడా ఏ ఏ కాలేజీల్లో అడ్మిషన్లు పొందవచ్చు..? ఎంత ఫీజు ఉంటుంది..? ఏ బ్రాంచ్‌కు భవిష్యత్తులో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి..? హాస్టల్, ట్రాన్స్‌పోర్ట్, ప్లేస్‌మెంట్స్ పరిస్థితి ఎలా ఉంటుంది..? విద్యార్థి మార్కులకు తగ్గట్టు ఏ కాలేజీ సరిపోతుంది..? విద్యార్థి ఆలోచనలకు అనుగుణంగా కోర్సులు నిర్ణయించుకోవడంలో కూడా ఉచితంగా గైడెన్స్ ఇస్తున్నామని కాలేజ్ మెంటర్ ప్రతినిధులు చెబుతున్నారు.

- Advertisement -

ఇప్పటి వరకు చాలామంది విద్యార్థులు “ర్యాంక్ రాలేదు అంటే ఇంజినీరింగ్ అయిపోయింది” అనే భావనలో ఉండేవారని.. కానీ వాస్తవానికి దేశవ్యాప్తంగా అనేక ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో మేనేజ్‌మెంట్ కోటా, స్పాట్ అడ్మిషన్లు, ప్రత్యేక సీట్ల ద్వారా అవకాశాలు ఉంటాయని వారు చెబుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News