Homeకెరీర్ న్యూస్Bank of Baroda | బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 206 ఖాళీలు..

Bank of Baroda | బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 206 ఖాళీలు..

  • నోటిఫికేషన్ విడుదల చేసిన అధికారులు..
  • ఆగష్టు 26 దరఖాస్తులు చివరి తేదీ..

బ్యాంకింగ్‌ సెక్టార్‌లో ఉద్యోగం చేయాలనుకునే వారికి బీవోబీ అవకాశం కల్పించింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.. ప్రభుత్వ బ్యాంకుల్లో ప్రముఖ బ్యాంక్‌ అయిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 206 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రెగ్యులర్‌ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నది.

పోస్టులు, విభాగాలు
చీఫ్‌ మేనేజర్‌, మేనేజర్‌, సీనియర్‌ మేనేజర్‌, ప్రొడక్ట్‌ మేనేజర్‌, టెక్నికల్‌ ఆఫీసర్‌, టెక్నికల్‌ సీనియర్‌ మేనేజర్‌, టెక్నికల్‌ మేనేజర్‌ పోస్టుల్లో నియామకాలు చేపట్టనున్నది బీవోబీ. డిజిటల్‌ బ్యాంకింగ్‌లో 19‌, ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌లో 88‌, ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీలో 16, సెక్యూరిటీలో 54, ఎంటర్‌ప్రైజ్‌ డేటా మేనేజ్‌మెంట్‌ ఆఫీస్‌లో 14‌, కార్పొరేట్‌ అకౌంట్స్‌ అండ్‌ ట్యాక్సేషన్‌ ప్లానింగ్‌లో 15 ఖాళీలు ఉన్నాయి.

- Advertisement -

అర్హతలు
పోస్టును బట్టి డిగ్రీ, బీఈ, బీటెక్‌, బీసీఏ, ఎంసీఏ, ఎమ్మెస్సీ, ఎంబీఏ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, పీజీ లేదా సంబంధిత పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. వయసు పోస్టును బట్టి 23 నుంచి 43 ఏండ్ల లోపు ఉండాలి. ఆయా పోస్టును బట్టి పని అనుభవం 2 నుంచి 10 సంవత్సరాలు ఉండాలి.

ఎంపిక
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. వీటిని స్క్రూటినీ చేస్తారు. దీన్ని బట్టి ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహిస్తారు. తరువాత సెకోమెట్రిక్‌ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఉంటుంది. కొన్ని పోస్టులకు గ్రూప్‌ డిస్కషన్‌ నిర్వహిస్తారు. దరఖాస్తు ఫీజు జనరల్‌, ఈడబ్ల్యూసీ, ఓబీసీలకు రూ. 850, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళలు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌లకు రూ. 175. ఎంపికైనవారికి పోస్టును బట్టి రూ. 48,480, రూ. 64,820, రూ. 85,920, రూ. 1,02,300 జీతం ఉంటుంది.

చివరితేదీ
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే చివరితేదీ ఆగస్టు 26. ఎంపికైనవారికి దేశంలోని ఏ బీవోబీ బ్యాంకులోనైనా ఉద్యోగం కల్పిస్తారు. దరఖాస్తుకు వెబ్‌సైట్‌ www.bankofbaroda.in చూడండి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News