Homeకెరీర్ న్యూస్NBEMS | వైద్య విద్య నాణ్యతకు కీలక నిర్ణయం..

NBEMS | వైద్య విద్య నాణ్యతకు కీలక నిర్ణయం..

  • ఆసుపత్రుల పని తీరులో పారదర్శకత..
  • వైద్య విద్య కోసం సరికొత్త మార్గదర్శకాలు..

భారతదేశంలో వైద్య విద్య నాణ్యతను మరింత పెంచేందుకు, ఆసుపత్రుల పనితీరులో పారదర్శకతను పెంచేందుకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ కీలక నిర్ణయాలు తీసుకుంది. మెడికల్ అక్రిడిటేషన్ , అడ్మిషన్ల ప్రక్రియలో ఊహించని మార్పులు తీసుకొస్తూ సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. దీనికితోడు వైద్య రంగంలో నిపుణుల కొరతను తీర్చడమే ధ్యేయంగా పీజీ, ఫెలోషిప్ విభాగాల్లో ఏకంగా 11 కొత్త స్పెషాలిటీ కోర్సులను ప్రారంభించింది. ఈ నూతన సంస్కరణలు దేశంలో వైద్య విద్య ప్రమాణాలను సరికొత్త ఎత్తుకు తీసుకెళ్తాయని నిపుణులు భావిస్తున్నారు.

గుర్తింపు పొందిన ఆసుపత్రులు, వైద్య సంస్థలు తమ అధికారిక వెబ్‌సైట్‌లలో ‘ఎన్‌బీఈఎమ్‌ఎస్ ఆవశ్యక సమాచారం’ పేరిట ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని బోర్డు కఠిన ఆదేశాలు జారీ చేసింది. అక్కడ ఆసుపత్రిలోని మౌలిక వసతులు, ఫ్యాకల్టీ వివరాలు, రోగుల రద్దీ, బెడ్ల లభ్యత , విద్యార్థులకు ఇచ్చే స్టైఫండ్ వివరాలను బహిరంగంగా ప్రదర్శించాల్సి ఉంటుంది. ప్రతి మూడు నెలలకొకసారి ఈ సమాచారాన్ని సమీక్షించి అప్‌డేట్ చేయాలి. అసత్య సమాచారం ఇచ్చినా, నిబంధనలు పాటించకపోయినా ఆయా ఆసుపత్రుల అక్రిడిటేషన్‌ను రద్దు చేయడమే కాకుండా కౌన్సెలింగ్ సీట్లలో కోత విధిస్తామని ఎన్‌బీఈఎమ్‌ఎస్ హెచ్చరించింది.

- Advertisement -

బోగస్ అడ్మిషన్లకు చెక్.. లక్ష రూపాయిల జరిమానా! అర్హతలు సరిగ్గా పరిశీలించకుండా, నకిలీ సర్టిఫికెట్లతో అడ్మిషన్లు ఇచ్చే ఆసుపత్రులపై బోర్డు ఉక్కుపాదం మోపనుంది. విద్యార్థులు అడ్మిషన్ పొందే సమయంలో వారి అసలు దస్తావేజులు (ఒరిజినల్ డాక్యుమెంట్లు), అర్హతలను ఆసుపత్రులు అత్యంత జాగ్రత్తగా తనిఖీ చేయాలని స్పష్టం చేసింది. ఒకవేళ ఏ ఆసుపత్రయినా నిబంధనలు ఉల్లంఘించి తప్పుడు సర్టిఫికెట్లతో ప్రవేశాలు కల్పిస్తే, సదరు ఆసుపత్రికి ఒక్కో అభ్యర్థిపై రూ. 1 లక్ష చొప్పున భారీ జరిమానా విధిస్తామని బోర్డు స్పష్టం చేసింది. ఆన్‌లైన్ పోర్టల్‌లో నిర్దేశిత గడువులోగా నమోదు పూర్తి చేయాలని ఆదేశించింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News