- బెల్లంపల్లి మండలం తేదీ:02-05-2026 రోజున బట్వాన్ పల్లి గ్రామంలో గంజాయి పట్టుకున్న తాళ్లగురిజాల పోలీసులు
ఈ సందర్భంగా తాల్లగురిజాల ఎస్ఐ రామకృష్ణ మాట్లాడుతూ దాగం రోహిత్ s/o చంద్రయ్య అను వ్యక్తి తన ఇంట్లో అక్రమంగా గంజాయి ఉంది అని వచ్చిన సమాచారం మేరకు మేము బట్వాన్ పల్లి గ్రామానికి వెళ్లి, ఆ వ్యక్తి ఇంటిని సెర్చ్ చేయగా అతని ఇంటిలో ఎండు గంజాయి దొరికినది. గంజాయి ఎక్కడిదని అడుగగా అతను ఇట్టి గంజాయి ని మహారాష్ట్ర నుండి తీసుకువచ్చి తన స్నేహితుడు అయిన జుమ్మిడి రాజశేఖర్ తో కలిసి చిన్న చిన్న ప్యాకెట్స్ తయారుచేసి చుట్టుపక్కల గంజాయి తాగే వారికి అమ్ముతామని, రాజశేఖర్ యొక్క ఇంటిలో కూడా ఎండు గంజాయి ఉన్నదని చెప్పగా మేము రాజశేఖర్ యొక్క ఇంటిని సెర్చ్ చేయగా అతని ఇంటిలో కూడా గంజాయి ఎండు గంజాయి దొరికినది.
తర్వాత రాజశేఖర్ ఉంటున్న ఇంటి చుట్టుప్రక్కల వెతకగా అతని ఇంటి వెనుక గల పెరడు లో రెండు గంజాయి మొక్కలు కనిపించాయి. గంజాయి మొక్కల గురించి వారిని ప్రశ్నించగా మహారాష్ట్ర నుండి ఎండు గంజాయి తీసుకురావడం ఎందుకు ఇక్కడే గంజాయి మొక్కలు నాటితే ఇంకా ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చని గంజాయి విత్తనాలు నాటి మొక్కలు పెంచుతున్నామని చెప్పారు.
వెంటనే వారి ఇద్దరి నుండి 690 గ్రాములు ఎండు గంజాయి మరియు రెండు గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుని వారి ఇద్దరిపై నిషేదిత మారకద్రవ్యాల నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేసి, గౌరవ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ గారి ముందు హాజరు పరచగా మేజిస్ట్రేట్ గారు వారిని రిమాండ్ కి తరలించడం జరిగింది. ఎవరైనా నిషేదిత మత్తు పదార్థాలు కల్గియున్న, అమ్మినా, రవాణా చేసినా, గంజాయి మొక్కలు పెంచినా, మత్తు పదార్థాలు సేవించినా చట్ట ప్రకారం నేరం కావున, కేసు నమోదు చేసి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు
