Saturday, June 13, 2026
Homeహైదరాబాద్‌Kumar Molugaram | పోటీ ప్రపంచంలో నైపుణ్యాభివృద్ధి అవసరం

Kumar Molugaram | పోటీ ప్రపంచంలో నైపుణ్యాభివృద్ధి అవసరం

  • కుమార్ మొలుగరమ్
  • ఉద్యోగాల సాధన ఎంపికలో ఉస్మానియా హెచ్‌ఆర్‌డీసీ
  • 80 మంది విద్యార్థులకు నియామక పత్రాలను అందజేసిన చాన్సులర్ మొలుగరం కుమార్
  • నైపుణ్యాభివృద్ధితో కెరీర్ అవకాశాలకు బాటలు- హర్షం వ్యక్తం చేసిన విద్యార్థులు

ఉస్మానియా విశ్వవిద్యాలయం మానవ వనరుల వికాస కేంద్రం (హెచ్‌ఆర్‌డీసీ)ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యోగ మేళా సమ్మేళనం 2025-26 విజయవంతంగా జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ కుమార్ మొలుగరమ్,హెచ్‌ఆర్‌డీసీ సంచాలకులు ప్రొఫెసర్ జి.విజయ చరణ్,తో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా కేంద్రం నిర్వహించిన నైపుణ్యాభివృద్ధి,వ్యక్తిత్వ వికాసం,పోటీ పరీక్షల శిక్షణ,విదేశీ విద్య,ఉపాధి అవకాశాలపై ప్రత్యేక కార్యక్రమాలను వివరించారు.

ప్రముఖ కంపెనీల సహకారంతో 20 ఉద్యోగ నియామక డ్రైవ్‌లు నిర్వహించి విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించినట్లు తెలిపారు.ప్రొఫెసర్ కుమార్ మొలుగరమ్ మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో నైపుణ్యాభివృద్ధి అత్యంత అవసరమని,విద్యార్థులు నిరంతర అభ్యాసంతో కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా మానవ వనరుల వికాస కేంద్ర కార్యాచరణ పుస్తకం 2025-26 ను విడుదల చేశారు.

- Advertisement -

అనంతరం సింజీన్ ఇంటర్నేషనల్,అరజెన్ లైఫ్ సైన్స్,రెసొనెన్స్,శ్రీ చైతన్య తదితర సంస్థల్లో ఎంపికైన సుమారు 80 మంది విద్యార్థులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు.కేంద్రం అందించిన శిక్షణ తమ ఉద్యోగ సాధనకు ఎంతో దోహదపడిందని ఎంపికైన విద్యార్థులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సమన్వయకర్త డా.యు.సూర్యవల్లి,సి.ఎఫ్.ఆర్.డి సంచాలకులు ప్రొఫెసర్ ఇ.సుజాత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News